తెలంగాణ కరీంనగర్ కు చెందిన గుడిపాటి రవీందర్ రెడ్డి డ్రగ్ మనీ లాండరింగ్ కేసులో శిక్ష పడింది. దాదాపు నాలుగు దశాబ్దాలకిందటే అమెరికాలో స్థిరపడిన రవీందర్ రోడ్డి మెక్సిక్ డ్రగ్ వ్యాపారుల దొంగ డబ్బును మెక్సికో దేశానికి పంపించడంలో సహకరించి పోలీసులకు చిక్కారు. టెక్సాస్, లారెడో లోని ఫెడరల్ జ్యూరీ మరొక ఐదుగురితో కలసి కోట్లాది డాలర్ల మనీ లాండరింగ్ కేసులో రవీందర్ రెడ్డి కి నేరస్థుడని ప్రకటించింది. డ్రగ్ మాఫియా అమెరికా లో డ్రగ్స్ విక్రయించి సేకరించిన నల్ల ధనాన్ని తన వ్యాపారాల ద్వారా మెక్సికో తరలించడ రవీందర్ రెడ్డి చేసిన పని.
మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఒక టిఆర్ ఎస్ మాజీ మంత్రికి రవీందర్ రెడ్డి దగ్గరి బంధువు. అంతేకాదు, ఆయన వ్యాపారాల్లో కూడా రవీందర్ రెడ్డి, ఆయన భార్య అరుణా రవీందర్ రెడ్డి డబ్బు పెట్టినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. రవీందర్ రెడ్డి కుటుంబం న్యూజెర్సీలోని నుట్లే లో నివసిస్తున్నది. డ్రగ్ మనీ లాండిరింగ్ కేసులో మొత్తం అరుగురి కి శిక్షపడితే ఇందులో అమెరిన్ ఇండియన్ లు ముగ్గురున్నారు. వారి పేర్లు:రవీందర్ రెడ్డి గుడిపాటి (61), హర్ష్ జగ్గి (54),నీరుజగ్గి (51). అయిదు వారాల విచారణ తర్వాత వీరంతా భారీ మనీ లాండరింగ్ పాల్పడటమేకాదు అనేక విధాలుగా చట్టాలను ఉల్లంఘించారని ఫెడరల్ జ్యూరీ పేర్కొంది.
రవీందర్ రెడ్డి కి అమెరికాలో చాలా చోట్ల పర్ ఫ్యూమ్ దుకాణాలున్నాయి. వాటిని ఆయన ఇంపెక్స్ ఎల్ ఎల్ సి పేరుతో నడుపుతున్నారు. జగ్గీలు ఇద్దరు ఎన్ రీనో ఇంటర్నేషన్ ఇన్ కార్పరేటెడ్ అనే సంస్థను నడుపుతున్నారు. ఈ వ్యాపారాల ద్వారా వీరంతా చేసే పని మనీ లాండరింగే. వీళ్ల ంతా పెద్ద పెద్ద మొత్తాలలో లూజ్ క్యాష్ ని తీసుకుని దానిని మెక్సికో కు చేరవేశారు. ఇది డబ్బంతా అక్రమ డ్రగ్ వ్యాపారం నుంచి వచ్చిందని తెలిసినాా రవీందర్ రెడ్డి ఖాతరు చేయకుండా తీసుకునేవాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. 2011-13 మధ్య వీరంతా కోట్లాది డాలర్ల డ్రగ్ మనీని న్యూయార్క్, కెంటుకీ, నార్త్ కెరొలీనా, మిసిసిపి, టెక్సాస్ లలో ఉండేతమ దుకాణాల ద్వారా స్వీకరించే వారు.
‘ ఈ కరెన్నీని రకరకాలుగా రవీందర్ రెడ్డి జగ్గీల దుకాణాలకు చేరవేసే వారు.
‘‘The money, in heat sealed packs, uneven rubber-banded money stacks, or loose U.S. currency, arrived in plastic bags, cloth bags, suitcases, backpacks, and even cereal boxes. The money was then distributed among downtown Laredo, Texas perfume stores, including El Reino International Inc., and NYSA Impex LLC. The owner of NYSA Impex LLC, Gudipati, and the owners of El Reino International Inc., Harsh Jaggi, and Neeru Jaggi, accepted loose bulk-cash, even after being told it was narco dinero’”, అని అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.
రవీందర్ రెడ్డి ఈ డ్రగ్ మనీ వ్యాపారం చేయడమే కాదు, తన ఆదాయాన్ని ప్రభుత్వానికి రిపోర్టు చేయడం కూడా ఎగ్గొట్టాడు. ఈ దుకాణాల యజమానులు పదివేల డాలర్ల కంటే ఎక్కువ డబ్బు స్వీకరించినపుడు ఈ డబ్బు ఎలా వచ్చిందో, ఏ కొరియర్ ద్వారా అందుకున్నారో వగయిరా వివరాలను తెలుపుతూ ఫామ్ 8300 ను ప్రభుత్వానికి సమర్పించాలి. రవీందర్ రెడ్డ ఈ పని చేయలేదు.
రవీందర్ రెడ్డి మీద మొత్తంగా అయిదు రకాల నేరాలు మోపారు. ఇందులో రెండు మనీలాండరింగ్ కు సంబంధించినవి, మరొక రెండు కేసులు ఫామ్ 8300 సమర్పించకపోవడానికి సంబంధించినవి. ఇక అయిదోది తప్పుడు సమాచారానికి సంబంధించిందని జస్టిస్ డిపార్ట్ మెంటు పేర్కొనింది.
టెక్సాస్ డిస్ట్రిక్ట్ జడ్జి మరీనా గార్షియా మార్మలెజో శిక్షను ప్రకటించే తేదీని ఇంకా ఖరారు చేయలేదు.
.
.