తాజాగా బీజేపీ నేతల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. కేంద్రంలో ప్రభుత్వం వేరు..పార్టీ వేరు అనే పరిస్థితి వచ్చింది. జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీకి ముడిపెట్టి విమర్శించేవారు. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా బీజేపీకి అవసరం మేర సహకరించేది. అయితే ఇప్పుడదే పార్టీ స్వరం మార్చింది. రాజధాని మ్యాటర్లో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ..దానికి బీజేపీ కి సంబంధం లేదని కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చింది. కేంద్రంలో ప్రభుత్వం వేరు..పార్టీ వేరు రెండింటికి సంబంధం లేదన్నట్లు కొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే ఈ లాజిక్ ఏపీ విషయంలో మాత్రం వర్తించదేమో.
ఇక్కడ పార్టీనీ..ప్రభుత్వాన్ని మాత్రం వేరుచేయలేదు. ఏపీ బీజేపీ నేతలకు మాత్రం ఈ రెండు ఇక్కడ ఒక్కటే. ఏపీ బీజేపీ మాటలు..తీరు ఎలా ఉన్నా? కేంద్రం నుంచి ప్రధాని మోదీ నుంచి మాత్రం జగన్ మోహన్ రెడ్డికి రాజధానుల విషయంలో కావాల్సిన మద్దతైతే దక్కుతున్నట్లే ఉంది. అమరావతిలో మోదీ వేసిన రాజధాని పునాది రాయి ఇప్పుడు మూడు ముక్కలు అవుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా..ఇవ్వకపోయినా జగన్ మోహన్ రెడ్డికి ఈ విషయంలో వెనుకనుంచి సపోర్ట్ చేస్తే చాలు అనుకున్నారు ఏమో!