దేశం బాగు పడాలంటే కేంద్రంలో పార్టీ మారాల్సిందేనా.. షాకింగ్ నిజాలివే!

కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో ఉండటం వల్ల బీజేపీ అనుకూల రాష్ట్రాలలో ఒక విధంగా బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలలో ఒక విధంగా పరిపాలన జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్రం ఒకింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూడా కాలయాపన చేస్తోంది. గతంలో కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ప్యాకేజీ వల్ల కలిగిన లబ్ధి శూన్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి అంతోఇంతో ప్రయోజనం చేకూరింది. వైఎస్సార్ రాష్ట్రానికి బెనిఫిట్ కలిగే విధంగా ఎన్నో స్కీమ్స్ ను అమలులోకి తెచ్చారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల ప్రజల విషయంలో ఒకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

జగన్, కేసీఆర్ సైతం మోదీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే సాహసం చేయడం లేదనే సంగతి తెలిసిందే. మోదీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే సాహసం చేస్తే తమ పార్టీకి భవిష్యత్తు ఉండదని జగన్ భావిస్తున్నారు. కేసీఆర్ మోదీ సర్కార్ పై విమర్శలు చేస్తున్నా ఆ విమర్శలు మరీ హద్దులు దాటడం లేదు. బీ.ఆర్.ఎస్ ను కేసీఆర్ విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నా అందుకు అనుగుణంగా ప్రజల్లో ఈ పార్టీపై పాజిటివ్ అభిప్రాయం కలగడం లేదు.

తెలుగు రాష్ట్రాలకు మంచి రోజులు ఎప్పటికి వస్తాయో చూడాల్సి ఉంది. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా పాలన సాగించడంలో మోదీ ఫెయిల్ అవుతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జగన్, కేసీఆర్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి.