జగన్ సర్కార్ కు మోదీ సర్కార్ భారీ షాక్.. ఆ హామీలు నెరవేరడం కష్టమే?

ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించిన సందర్భాలు చాలా తక్కువనే సంగతి తెలిసిందే. అయితే కేంద్రం మాత్రం జగన్ సర్కార్ కు వరుస షాకులివ్వడం హాట్ టాపిక్ అవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని తేల్చి చెప్పింది. గతంలో కొన్ని రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక హోదా కల్పించినా ఇప్పుడు ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని కేంద్రం చెబుతోంది.

 

చెప్పిన గడువులో పోలవరం నిర్మాణం పూర్తి కావడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. వేర్వేరు కారణాల వల్ల గడువులోగా పోలవరంను పూర్తి చేయడం జరగదని అన్నారు. కేవలం 2441 కోట్ల రూపాయలు మాత్రమే పోలవరంకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి దక్కనుందని కేంద్రం చెబుతుండటం గమనార్హం. విభజన హామీలను నెరవేర్చే ఉద్దేశం కేంద్రంకు లేదని స్పష్టత వచ్చేసింది.

 

కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఏపీకి ఊహించని స్థాయిలో నష్టం కలుగుతోంది. మోదీ సర్కార్ కు పలు సందర్భాల్లో జగన్ మద్దతు ప్రకటించినా ఏపీకి ఆశించిన స్థాయిలో ప్రయోజనం కలగడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కేంద్రం వల్ల ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి జగన్ ప్రశ్నిస్తారో లేదో చూడాల్సి ఉంది.

 

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏపీ అభివృద్ధి మరింత ఆలస్యమవుతుందని చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ, తెలంగాణలను విడదీయడం ద్వారా ఏపీ ఊహించని స్థాయిలో నష్టపోయింది. ఏపీకి కేంద్రం సహాయసహకారాలు అందిస్తే బాగుంటుందని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి