2024 ఎన్నికలకు మరో 17 నెలల సమయం ఉంది. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఎన్నికల్లో వైసీపీ గెలవడం సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో టీడీపీ ఆఫర్ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల విషయంలో పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు పవన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సొంతంగా లేదా బీజేపీతో కలిసిపోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చారు.
మోదీతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ దిశగా నిర్ణయాలు తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే మోదీ ప్లాన్ తో మళ్లీ వైసీపీకే అధికారం దక్కనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ నిర్ణయాన్ని మోదీ మార్చేసిన నేపథ్యంలో పవన్ సూచనల మేరకు జనసేన నేతలు సైతం యాక్టివ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. మారుతున్న పరిణామాలు చంద్రబాబు నాయుడుకు గుబులు పుట్టిస్తున్నాయి.
ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తుండగా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకూడదని మోదీ భావిస్తున్నారు. చంద్రబాబు పర్యటనలకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. సంక్షేమ పథకాల అమలు విషయంలో తెలుగుదేశం విఫలం కాగా కరోనా సమయంలో సైతం ప్రజలకు పథకాలు అందేలా సీఎం జగన్ అడుగులు వేశారు.
జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలకు మంచి పరిపాలన దక్కుతుండటం గమనార్హం. జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాల వల్ల సామాన్య ప్రజల జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. జగన్ మేనిఫెస్టోను ప్రకటించిన సమయంలో ఆ హామీలను నెరవేర్చడం సాధ్యం కాదని చాలామంది భావించారు. అయితే జగన్ మాత్రం ముందుచూపుతో వ్యవహరించి ప్రజల హృదయాల్లో స్థానం సొంతం చేసుకోవడం గమనార్హం.