చంద్రబాబు – పవన్ లకు “భారీ” షాకిచ్చిన మోడీ!

గత కొంతకాలంగా చంద్రబాబు & కో లు మోడీ భజనలో ఉన్నారు. ఈసారి కూడా ఎలాగైన బీజేపీతో కలిసి పోటీ చేయాలని, 2014 ఫలితాలు తిరిగి సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అలాకానిపక్షంలో పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అయ్యే పరిస్థితి అని బాబు గ్రహించారు! పైగా జనసేనకు కూడా ఈసారి ఎన్నికలు చాలా కీలకం. ఈ ఎన్నికల్లో పవన్ ఓడిపోతే… ఇక సినిమాలు చేసుకోవడం అంత ఉత్తమం మరొకటి లేదనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు – పవన్ లు మోడీ నుంచి కోరుకుంటున్నది ఒక్కటే… తమకు సహకరించకపోయినా పర్లేదు కానీ జగన్ కు మాత్రం సాయం చేయొద్దని!

ఏపీలో జగన్ దూసుకుపోతున్నారు. ఊహించని రీతిలో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా సామాన్యుడికి కష్టం కలగకుండా చూసుకోవడంలో సక్సెస్ అయ్యారు! దీంతో… ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయినా కేంద్రం నుంచి ఆర్ధిక సాయం అందకుండాఉంటే జగన్ ఇరకాటంలో పడతారని బాబు & కో భావించారు. టీడీపీ అనుకూల మీడియాలో నేరుగానే ఈ విషయాన్ని ప్రస్థావించారు. కేంద్రంలో మోడీ.. జగన్ కి ఆర్ధికంగా సాయం చేయకపోతే చాలు.. జగన్ ను ప్రజలే తిరస్కరిస్తారని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయాన్ని మోడీ మాత్రం లైట్ తీసుకున్నారు. జగన్ కు భారీ మొత్తంలో రెవెన్యూ లోటు నిధుల్ని అందించారు.

గ‌తంలో చంద్రబాబు.. ఎన్‌డీఏ భాగ‌స్వామిగా ఉంటూ కూడా కేంద్రం నుంచి రెవెన్యూ ఆర్థిక లోటు నిధుల్ని రాబట్టలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధైర్యంగా చెప్పలేకపోతున్న టీడీపీ అనుకూల మీడియా… గతంలో చంద్రబాబు ఎన్ని మొత్తుకున్నా కేంద్రం ఇవ్వలేదని చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే… అప్పుడు చంద్రబాబు – బీజేపీతో పొత్తులో ఉన్నారు. కానీ వైఎస్ జ‌గ‌న్ మాత్రం కీలకసమయంలో భారీ మొత్తంలో రెవెన్యూ లోటు నిధుల్ని రాబ‌ట్టుకున్నారు. దీంతో ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు జ‌గ‌న్ సర్కార్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఊప‌రి తీసుకోడానికి అవకాశం కలిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు కింద 10,460.87 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఆర్థికంగా జగన్ కు గొప్ప రిలీఫ్.

జగన్ సర్కార్ సంగతి అలా ఉంచితే… ఈ విషయాన్ని మాత్రం టీడీపీ, వారి అనుకూల మీడియా జీర్ణించుకోలేకపోతున్నారు. ఊహించని ఈ పరిణామం వారిని షాక్ కి గురిచేసిందంట. ఆర్థిక ఇబ్బందుల‌తో సంక్షేమ ప‌థ‌కాల‌ను నిలిపేసి ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటార‌ని ఆశించిన వారంతా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో అవక్కాయ్యారంట. దీంతో… ఇక జగన్ ను ఆపడం కష్టమని, టీడీపీ – జనసేనలతో బీజేపీ పొత్తు కూడా అనుమానమే అని అంటున్నారంట తమ్ముళ్లు!