ఏపీ తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇరు రాష్ట్రాల్లో చెరో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 28 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 1న నామినేషన్లను పరిశీలిస్తారు. మార్చి 5 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఫిబ్రవరి 12 న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ చేపడుతారు. మార్చి 15నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.