బెజవాడలో పట్టపగలే పెట్రోల్ పోసి తగలబెట్టారు (వీడియో)

విజయవాడలో పట్టపగలే దారుణం జరిగింది. గవర్నర్ పేటలోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు గగారిన్ అనే వ్యక్తి పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో గగారిన్ తీవ్రంగా గాయపడ్డాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న గగారిన్ ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గగారిన్ పరిస్థితి విషమంగా ఉంది.

గగారిన్ కు ఫైనాన్స్ వ్యాపారులతో వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాల కారణంగా వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టగా పోలీసులు తెలిపారు. గగారిన్ పై దాడి చేసిన వీడియో కింద ఉంది చూడండి.

 

https://youtu.be/5CErNtCTMRg