మంత్రి సీదిరి అప్పలరాజుకి వైసీపీ అధినాయకత్వం హుటాహుటిన రావాల్సిందిగా కబురు పెట్టింది. ముఖ్యమంత్రితో అత్యవసర భేటీకి సీదిరి అప్పలరాజు హాజరయ్యారు కూడా.! భేటీ అనంతరం, ‘మంత్రి పదవి లేకపోయినా ఫర్వలేదు..’ అంటూ నిట్టూర్చారు సీదిరి అప్పలరాజు.
‘మంత్రి పదవి లేకపోయినా, వైసీపీలో ఎమ్మెల్యేలంతా మంత్రులే.. మంత్రి పదవి పోతుందన్న సంకేతాలైతే నాకు అందలేదు’ అని సీదిరి అప్పలరాజు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏమయ్యిందబ్బా.? సీదిరి అప్పలరాజుకి, హుటాహుటిన వైసీపీ అధినాయకత్వం ఎందుకు ‘పిలుపు’ ఇచ్చినట్లు.? మొన్నటికి మొన్న ఉత్తరాంధ్రలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో గ్రాడ్యుయేట్లు మంత్రి సీదిరి అప్పలరాజుకి వ్యతిరేకంగా ‘చిట్టీలు’ వేశారు, బ్యాలెట్ బాక్సుల్లో.. ఓట్లతోపాటుగా. ఆ వ్యవహారం అప్పట్లో సంచలనం. సీనియర్ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తదితరులపై అవినీతి ఆరోపణలు మామూలే.
వారి మీద గ్రాడ్యుయేట్లు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.. కానీ, సీదిరి అప్పలరాజు విషయంలో తేడా కొట్టింది. వైసీపీకి పట్టిన శని… అని కొందరు వైసీపీ మద్దతుదారులే మండిపడుతున్నారు సీదిరి విషయంలో గత కొంతకాలంగా. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, మంత్రి సీదిరి అప్పలరాజుకి ఉద్వాసన పలకాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయించుకుందట. ఇది నిజమేనా.? నమ్మొచ్చా.?