Nara Lokesh: 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కూటమి పార్టీలు 164 స్థానాలలో విజయకేతనం ఎగురువేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ విధంగా అధికారంలో కూటమి ప్రభుత్వం ఉండగా వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది కేవలం 11 స్థానాలకు మాత్రమే వైకాపా పరిమితం అయింది. ఈ క్రమంలోనే ఎంతోమంది వైకాపా నుంచి కీలక నేతలు పార్టీ నుంచి వలసలు వెళ్తున్న విషయం మనకు తెలిసింది. ఇప్పటికే కొందరు తెలుగుదేశం పార్టీలో చేరగా మరికొందరు జనసేన బీజేపీలోకి చేరికలు మొదలుపెట్టారు.
ఇలా పెద్ద ఎత్తున వైకాపా నుంచి నాయకులు బయటకు వస్తున్న నేపథ్యంలో కూటమి పార్టీ నేతలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడప్పుడే వైకాపా నుంచి వచ్చిన వారందరినీ కూడా మన పార్టీలో చేర్చుకోవడం కరెక్ట్ కాదని భావించారు. కొద్ది రోజులు ఆగిన తర్వాత వారిని పార్టీలో చేర్చుకోవడం గురించి ఆలోచిద్దామని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇలా తెలుగుదేశం పార్టీలోకి రావద్దని చెప్పినప్పటికీ కొంతమంది జనసేన బిజెపిలోకి వెళ్లిపోతున్నారు. ఇదే విషయం గురించి టిడిపి మంత్రులు నారా లోకేష్ వద్ద పంచాయతీ పెట్టినట్టు తెలుస్తుంది.
నిన్న క్యాబినెట్ మీటింగ్ ముగిసిన అనంతరం కొంతమంది మంత్రులు లోకేష్ వద్దకు వెళ్లి తాము పార్టీలో చేర్చుకోమని చెప్పినప్పటికీ వైకాపా నుంచి ఎంతోమంది జనసేన పార్టీలో చేరుతున్నారని వారి చేరికల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో మనల్ని ఎంతో ఇబ్బందులకు గురి చేసినటువంటి వైకాపా నాయకులు ఇప్పుడు మన పార్టీలోకి రావడం ఏమాత్రం సమంజసం కాదని ఈ విషయంపై పునరాలోచన చేయాలి అంటూ లోకేష్ వద్ద వారి బాధను మొత్తం బయటపెట్టారు. ఇక వారి అభ్యర్థనలు విన్న తర్వాత లోకేష్ ఈ విషయం గురించి నేను పార్టీ అధినేతతో మాట్లాడి ఓ నిర్ణయానికి వస్తామని చెప్పినట్టు తెలుస్తుంది.