AP: త్వరలోనే ఏపీ క్యాబినెట్ విస్తరణ జరగబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా కొంతమంది మంత్రులను తొలగించి కొత్తవారిని మంత్రివర్గంలోకి ఆహ్వానించబోతున్నారని సమాచారం. అయితే జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు మంత్రిగా ఏపీ క్యాబినెట్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది.
జనసేన పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనకు రాజ్యసభ ఇవ్వాలనుకున్నాము. అది కుదరడకపోవడంతో ఎమ్మెల్సీగా తీసుకొని అనంతరం మంత్రిగా పదవి ఇస్తాము అంటూ ఇటీవల స్వయంగా పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు మంత్రి పదవి ఇవ్వడం గురించి వెల్లడించారు. ఇక నాగబాబు ఎన్నికలలో ఎక్కడ పోటీ చేయకపోయినా ఆయనని ఎమ్మెల్సీగా తీసుకొని అనంతరం మంత్రి పదవి ఇవ్వబోతున్నారని స్పష్టమైనది.
ఈ క్రమంలోనే తాజాగా నాగబాబు మంత్రి పదవి అందుకోవడం గురించి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. త్వరలోనే నాగబాబు మంత్రివర్గంలోకి వస్తారని, నాకు తెలిసి ఇకపై మంత్రివర్గంలో మార్పులు ఉండకపోవచ్చు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.
ఇక నాగబాబు మంత్రివర్గంలోకి అడుగుపెట్టిన ఆయనకు ఏ పదవి ఇవ్వబోతున్నారనే విషయంపై ఆసక్తి కలుగుతుంది అయితే ఇప్పటికే జనసేన నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన వద్ద ఉన్నటువంటి సినిమాటోగ్రఫీతో పాటు పవన్ కళ్యాణ్ శాఖలలో ఒక శాఖను నాగబాబు కోసం కేటాయించబోతున్నారని తెలుస్తోంది.
ఇక జనవరి 8వ తేదీన నాగబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈయన ఎప్పుడు మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. అయితే మంత్రి కంటే ముందుగా ఈయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనంతరం మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నట్టు తెలుస్తుంది.