రాజకీయ విమర్శలు చేయడంలో మంత్రి రోజా రూటే సెపరేటు.! ఇత్తడైపోద్ది.. అని వెటకారం చేసినా.. ‘డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందర తొడగొడితే..’ అని వ్యాఖ్యానించినా.. ఇవన్నీ ఆమె ట్రేడ్ మార్క్ సినిమాటిక్ పొలిటికల్ డైలాగ్స్.!
ఇప్పుడేమో, అనవసరంగా జుగుప్సాకరమైన విమర్శల్ని ఎదుర్కొంటున్నారామె. అనవసరంగా కాదు లెండి.. స్వయంకృతాపరాధమే.! టీడీపీ చెప్పినట్లల్లా వింటూ, హెరిటేజ్ ఐస్‌క్రీమ్ నోట్లో పెట్టుకుని.. అంటూ జనసేన అధినేత వపన్ కళ్యాణ్ మీద వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్ వ్యవస్థ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల ఫలితమిది. దత్త పుత్రుడు.. ప్యాకేజీ స్టార్.. ఇవన్నీ పాత వ్యవహారాలు. ఇప్పుడేమో కొత్తగా హెరిటేజ్ ఐస్‌క్రీమ్ ప్రస్తావన వచ్చింది. అయితే, అది అత్యంత జుగుప్పాకరమైనది. దానర్థమేంటో రోజాకి తెలియదని ఎలా అనుకోగలం.?
అందుకే స్వయంకృతాపరాధం అనేది. రాజకీయాల్లో మాటల్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. లేకపోతే, పరిస్థితులు తారుమారైపోతాయ్. కాల్ మనీ రాకెట్ ప్రస్తావన దగ్గర్నుంచి, చాలా విషయాల్ని రోజా ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆమెకు ఫుల్ మార్క్స్.
కానీ, ఐస్‌క్రీమ్ వ్యవహారంలోనే.. అత్యంత దారుణం. సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఇది.! ఎందుకంటే, పవన్ కళ్యాణ్ ఏనాడూ టీడీపీలో చేరలేదు, ఆయన టీడీపీ సభ్యుడిగా ఎప్పుడూ వుండలేదు. కానీ, రోజా అలా కాదు కదా. ఆమె గతంలో టీడీపీ నేత. తెలుగు మహిళ అధ్యక్షురాలిగానూ పని చేశారు.
మరి, హెరిటేజ్ ఐస్‌క్రీమ్ విషయంలో సంబంధ బాంధవ్యాలు ఎవరికి వున్నట్లు.? పాత వీడియోలు బయటకు వస్తున్నాయ్.! ఇది రోజాకి మైనస్సా.? వైసీపీకి మైనస్సా.? రోజా ఆత్మవిమర్శ చేసుకోవాలి.