చంద్రబాబుని చంపేవాళ్లు ఇంకా పుట్టలేదు… రోజా కామెంట్స్ వైరల్!

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకి ఏసీబీ కోర్టు 14 రోజులు డిమాండ్ విధించింది. దీంతో జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం ఆదివారం అర్ధరాత్రి విజయవాడ నుంచి చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

ఈ క్రమంలో చంద్రబాబుకు ఇంటి నుంచి తెప్పించుకున్న బోజనం తింటూ, మెడిసిన్స్ వేసుకునే అవకాశం ఇవ్వాలని పిటిషన్ వేశారు. అందుకు కోర్టు అనుమతించింది. దీంతో బాబుకు ఉదయం ఫ్రూట్ సలాడ్, బ్లాక్ కాఫీ పంపించారు. ఈ సమయంలో హౌస్‌ అరెస్ట్‌ కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్ పై వాదించేందుకు విజయవాడ కోర్టుకు వచ్చిన న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును… హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదించేందుకు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది లూథ్రా విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ సమయంలో మైకులముందుకు వచ్చిన ఆయన… చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, జైల్లో ఉంచడం సరికాదని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై రోజా ఘాటుగా స్పందించారు.

చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ఆయన తరుపు న్యాయవాది సిద్ధర్థ్ లూథ్రా చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి ఆర్కే రోజా తనదైన శైలిలో స్పందించారు. ఇందులో భాగంగా “చంద్రబాబు ఎవరినైనా చంపేస్తాడు కానీ… ఆయనను చంపేవాళ్లు ఎవరూ పుట్టలేదు” అన్ని రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో ఇప్పటికే రాజకీయంగా ఇప్పటికే ఎంతోమందిని పైకి పంపించిన చంద్రబాబు.. మరెంతోమందిని జైలుపాలు చేశారని, ఇంకెంతో మందిని హింసించారని అన్నారు. ఆయన చేసిన పాపాలకు శిక్ష అనుభవించడం కోసమే ఇంకా బ్రతికి ఉన్నాడని, అందుకే అలిపిరి బ్లాస్ట్ లో చంద్రబాబు బ్రతికారని రోజా వ్యాఖ్యానించారు. అదేవిధంగా… చేసిన పాపాలకు శిక్ష అనుభవించడం కోసమే నాడు అలిపిరి ఘటనలో తప్పించుకున్నారని, లేకుంటే అప్పుడే చనిపోయే వారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో చంద్రబాబుని ఆర్ధిక ఉగ్రవాదిగా సంబోధించిన రోజా… స్కిల్‌ స్కాం కు పాత్రధారి, సూత్రధారి చంద్రబాబేనని దుయ్యబట్టారు. ప్రజలు తనకు ఇచ్చిన అధికారాన్ని చంద్రబాబు దోపిడీ కోసమే ఉపయోగించుకున్నారని విమర్శించారు. అధికారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు రిమాండ్‌ కు పంపిందని తెలిపారు.