AP: జోగి రమేష్ వ్యవహారం సీఎంకు క్షమాపణలు చెప్పిన మంత్రి పార్థసారథి.. ఏమైందంటే?

AP: నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. అయితే ఊహించని విధంగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైకాపా మాజీ మంత్రి జోగి రమేష్ కూడా కనిపించడంతో ఒక్కసారిగా ఈ విషయం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో చర్చలకు కారణమైంది. ఇలా టిడిపి మంత్రితో కలిసి వైకాపా మాజీ మంత్రి కనిపించడం దేనికి సంకేతం ఆయన టిడిపిలోకి రాబోతున్నారా అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అయితే ఈ విషయంపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది.

ఇలా లోకేష్ సీరియస్ కావడంతో మంత్రి పార్థసారథి వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ పార్టీకి సంబంధించినది కాదు అది గౌడ సంఘీయులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమానికి జోగి రమేష్ వస్తారనే విషయం నాకు అసలు తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే నేను ఈ కార్యక్రమానికి వెళ్లకుండా ఉండేవాడినని పార్థసారథి తెలిపారు.

ఈ కార్యక్రమానికి తాను సుమారు గంటన్నర పాటు ఆలస్యంగా వెళ్లాను అయితే అప్పటికే జోగి రమేష్ అక్కడ ఉన్నారని పార్థసారథి తెలిపారు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని అది అనుకోకుండా జరిగిన సంఘటనని తెలిపారు. ఈ విషయంలో నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నారా లోకేష్, చంద్రబాబు ముఖ్యమంత్రి క్షమాపణలు తెలియజేస్తున్నానని వెల్లడించారు.

పార్టీకి నష్టం కలిగించే కార్యక్రమాలు నేను ఏ రోజూ చేయను. ఎల్లవేళలా టీడీపీ బలోపేతానికి కృషి చేస్తాను. చంద్రబాబు, లోకేష్ నాయకత్వం బలపడేందుకు పనిచేస్తాను. జగన్ నాయకత్వంపై నమ్మకం కోల్పోయి అనేకమంది నేతలు జనసేన, టీడీపీలో చేరుతున్నారు. జోగి రమేశ్ కూడా ఆ విధమైన ప్రయత్నం చేశారేమో అనేది కూడా నాకు తెలియని అంశం అంటూ పార్థసారథి ఈ సందర్భంగా వివరణ ఇస్తూ చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు.

జోగి రమేశ్‌ వ్యవహారంపై మంత్రి పార్థసారథి క్షమాపణలు|Minister Parthasarathy on Jogi Ramesh Issue