వైద్య, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి కాడారి శ్రవణ్ కుమార్ రాజీనామా చేశారు. ఆరు నెలల క్రితం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిడారి ఉభయ సభల్లో ఎందులోను సభ్యుడు కాలేకపోవటంతో ఈరోజు రాజీనామా చేయాల్సొచ్చింది. తన తండ్రి, ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు చంపేయటంతో కారుణ్య నియామకాల కోటాలో చంద్రబాబు శ్రవణ్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
ఉభయ సభల్లో ఎందులోను సభ్యుడు కాకపోయినా, రాజకీయాలకు కొత్తయినా సరే శ్రవణ్ ను చంద్రబాబు ఎందుకు మంత్రిని చేశారు ? ఎందుకంటే, గిరిజనుల ఓట్ల కోసమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2014 ఎన్నికల్లో టిడిపి తరపునుండి పోటీ చేసిన గిరిజనుల్లో ఒక్కళ్ళు కూడా ఎంఎల్ఏ, ఎంపిగా ఎన్నిక కాలేదు. కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో గిరిజనుల ఓట్లను కొల్లగొట్టేందుకే చంద్రబాబు సెంటిమెంటును పండించేదుకే శ్రవణ్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
ఏ సభలోను సభ్యుడుకాని వ్యక్తిని మంత్రిని చేసినపుడు ఆరుమాసాల్లోగా ఏదో ఒక సభలో సభ్యునిగా చేయాలన్న విషయం చంద్రబాబుకు తెలీదా ? తెలుసు అయినా శ్రవణ్ సభ్యునిగా చేయలేదు. దాని ఫలితంగానే ఇపుడు శ్రవణ్ రాజీనామా చేయటం. మంత్రి రాజీనామా విషయమై రాజ్ భవన్ అలర్ట్ చేయటంతో మంత్రి రాజీనామ చేశారు.
నవంబర్ 11వ తేదీన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న శ్రవణ్ మే 11వ తేదీలోగా ఏదో ఓ సభలో సభ్యుడు కావాలి. సరే 23వ తేదీ ఫలితాల్లో ఏమవుతుందన్నది వేరే సంగతి. ఎందుకంటే 23వ తేదీన చంద్రబాబు ప్రభుత్వమే పడిపోతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అందరితోను శ్రవణ్ పదవి ఊడటం వేరు అందరికన్నా ముందే రాజీనామా చేయటం వేరు కదా ?