జగన్ ఫేస్ మాస్క్‌ తో సీదిరి ఛాలెంజ్… లాజిక్కే!

గతకొన్ని రోజులుగా తమ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన కియా షోరూం దగ్గర నుంచి చెరువులూ, కుంటల వరకూ దేన్నీ వదలకుండా సెల్ఫీలు దిగుతూ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు నారా లోకేష్. దీంతో తాజాగా జగన్ ఫేస్ మాస్క్ తో మంత్రి సిదిరి అప్పలరాజు ప్రతిపక్ష నాయకులకు ఛాలెంజ్ చేస్తూ… సంచలన విషయాలు వెల్లడించారు. దీంతో… నిజమే కదా అని అంటున్నారు విశ్లేషకులు!

పలాసలో త్వరలో ప్రారంభించనున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ముందు సీఎం జగన్ ఫేస్ మాస్క్‌ తో సెల్ఫీ ఛాలెంజ్ చేసిన మంత్రి అప్పలరాజు… అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బహిరంగ సవాల్‌ విసిరారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఒక్క పోర్ట్, ఒక్క హార్బర్‌ కు శంకుస్థాపన చేసినట్టు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. 989 కిలోమీటర్లు తీరప్రాంతం ఉన్న రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఏం చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు దూర దృష్టి ఏంటి..? విజనరీ ఏంటి..? అంటూ ఎద్దేవ చేశారు.

అనంతరం అచ్చెన్నాయుడిపై ఫైర్ అయిన అప్పలరాజు… అచ్చెన్నాయుడుకు పోయేకాలం వచ్చిందని.. అందుకే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో టెక్కలి నుంచి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీను గెలిచి తీరుతారని జోస్యం చెప్పిన అప్పలరాజు… ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చిద్దామాని.. దమ్ముంటే అచ్చెన్నాయుడు చర్చకు రావాలని సవాల్‌ చేశారు.

ఈ నేపథ్యంలో ఇంకాస్త డోస్ పెంచిన ఆయన… కళ్లు కనిపించడంలేదా..? మేం చేస్తున్న ప్రోజెక్టులు మీ ముందు లేవా..? శ్రీకాకుళం జిల్లాకు ఇది చేశామని అచ్చెన్నాయుడు ఏమఒఇనా చెప్పగలరా..? మరేదైనా చూపించగలరా..? అంటూ ప్రశ్నల బాణాలు సంధించారు!

అయితే… చంద్రబాబు కెరీర్ లో ఇప్పటివరకూ ఒక్క పోర్ట్, ఒక్క హార్బర్ కు కూడా కనీసం శంకుస్థాపన చేయలేదు అని అప్పలరాజు చెప్పిన విషయం ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది. తనను తాను విజనరీగా చెప్పుకునే చంద్రబాబు… తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ పనిచేసిఉంటే… నేడు శ్రీకాకుళం జిల్లా ఎంతో అభివృద్ధి చెందేదని, వలసలు పోయి పనులు చేసుకోవాల్సిన బాదలు తప్పేవని అంటున్నారు జిల్లా వాసులు! కేవలం హైదరబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం దృష్ట్యా సిటీని విస్తరించుకుంటూ పోయి.. దాన్ని మాత్రమే అభివృద్ధి అని చెప్పుకున్నారని… వెనుకబడిన ఉత్తరాంధ్ర విషయంలో ఆ దూరదృష్టి ఏమైందని ప్రశ్నిస్తున్నారు జిల్లా యువకులు!

ఏది ఏమైనా… జగన్ ఫేస్ మాస్క్ ధరించి సీదిరి చేసిన సెల్ఫీ చాలెంజ్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది!