మంత్రి అఖిలప్రియ షాకింగ్ డెసిషన్

ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అఖిలప్రియ తన నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే ప్రత్యర్థులను ఉద్దేశించి అఖిలప్రియ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. తాజాగా ఆమె మరో సంచలనానికి తెర లేపారు. దీనిపై మరింత సమాచారం కింద ఉంది చదవండి.

కర్నూలులో ఎస్పీ వర్సెస్ అఖిలప్రియగా వ్యవహారం నడుస్తోంది. ఎస్పీపై కోపంతో మంత్రి అఖిలప్రియ తనకు ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లను తిరస్కరించారు. రెండు రోజులుగా గన్ మెన్లు లేకుండానే అఖిలప్రియ జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మంత్రి అనుచరుల ఇళ్లలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించడంతో ఈ వివాదం చెలరేగింది. తన మనుషుల ఇళ్లలో సోదాలు నిర్వహించడాన్ని అఖిలప్రియ తప్పుబట్టారు. పోలీసులు మాత్రం విధి నిర్వహణలో భాగంగానే కార్డన్ సర్చ్ నిర్వహించామని చెబుతున్నారు.

శుక్రవారం నుండి మంత్రి అఖిలప్రియా సెక్యూరిటీ లేకుండానే జన్మభూమిలో పాల్గొంటున్నారు. గురువారం తెల్లవారుజామున ఆళ్లగడ్డలో మంత్రి అనుచరుల ఇళ్లలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ విషయం మంత్రికి ఆగ్రహం తెప్పించింది. ఎలాంటి కేసులు లేని తనవాళ్ల ఇళ్లపైన సోదాలు నిర్వహించడం ఏమిటని ఆమె మండిపడుతున్నారు. కార్డన్ సర్చ్ పేరుతో గ్రామంలోని ప్రజలను వేధిస్తున్నారు అని అఖిలప్రియ చేస్తున్న ప్రధాన ఆరోపణ.

కార్డన్ సర్చ్ విషయం తెలియగానే తన గన్ మెన్లను పంపించేశారు అఖిలప్రియ. మంత్రి ఇట్టివద్ద కానీ ఆమె పర్యటనలో కానీ సెక్యూరిటీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి బందోబస్తు లేకుండానే ప్రస్తుతం ఆమె రుద్రవరం మండలంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాగా పోలీసులు మాత్రం తమ డ్యూటీలో భాగంగానే కార్డన్ సర్చ్ జరిపామంటున్నారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో తనిఖీలు చేయడం సర్వసాధారణమని, అందులో భాగంగానే తనికీలు చేపట్టామని పోలీసులు వివరిస్తున్నారు.

ఒక పార్టీకి సంబంధించి, ఒక వ్యక్తికి సంబంధించిన వారి ఇళ్లలో మాత్రమే సోదాలు నిర్వహించలేదు. అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తుల ఇళ్లలో కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. మంత్రికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోలేదని పోలీసులు తెలిపారు. కాగా అఖిలప్రియ మాత్రం నేర చరిత్ర ఉన్నవారి ఇళ్లలో తనిఖీలు చేస్తే తప్పు లేదని కానీ సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేలా వీరు తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.