Ap: ఏపీ క్యాబినెట్లో చోటు దక్కించుకున్న మెగా బ్రదర్ నాగబాబు.. అధికారం ఉంటే చాలు మంత్రి కావచ్చా?

Ap: ఏపీ రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2024 ఎన్నికలలో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీ, బాజాపా మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని మరి ఎన్నికలలో పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఎన్నికలలో భాగంగా వైసిపి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కాక కూటమి పార్టీలు మాత్రం 164 స్థానాలలో విజయకేతనం ఎగరవేశాయి దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది.

ఇలా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పలు రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి ఈ క్రమంలోనే మూడు రాజ్యసభ స్థానాలకు ఎవరు ఎంపిక అవుతారు అనే విషయంపై ఇదివరకు చర్చలు జరిగాయి అయితే ఈ పదవిపై జనసేన నుంచి నాగబాబు రాజ్యసభకు వెళ్తారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి అయితే ఈ వార్తలపై ఎప్పటికప్పుడు నాగబాబు స్పందిస్తూ తనకు పదవులపై ఆశ లేదని తన తమ్ముడికి కోసం తాను చివరి వరకు పోరాటం చేస్తానని తెలిపారు.

ఇలా నాగబాబు పేరు రాజ్యసభ రేసులో ఉండగా ఊహించని విధంగా ఈయన ఏపీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారని తెలుస్తోంది. నాగబాబును ఏపీ కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జనసేన పార్టీ నుంచి మంత్రిగా నియమించబోతున్నారని తెలుస్తుంది. మరి ఈయనకు ఏ శాఖ ఇస్తారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

ఇక నాగబాబుకి ఈ పదవి ఇవ్వడం పట్ల సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. నాగబాబు తెలంగాణలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో ఈయన ఎక్కడ పోటీ చేయలేదు ఇలా ప్రజలు ఈయనని ఎన్నుకోబడకపోయినా ఈయన మాత్రం మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారం ఒకటి ఉంటే చాలు ఎవరైనా మంత్రులు కావచ్చని కూటమి ప్రభుత్వం నిరూపించిందని గతంలో లోకేష్ కూడా ఇలాగే మంత్రి అయ్యారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.