2024 ఎన్నికలకు మరో 18 నెలల సమయం మాత్రమే ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కొత్త అకౌంట్ల ద్వారా వైసీపీకి అనుకూలంగా ప్రచారం జరగడానికి ప్రశాంత్ కిషోర్ టీం తన వంతు కృషి చేస్తోంది. వైసీపీ అధికారికంగా ఆ సోషల్ మీడియా పోస్టులు తమ పార్టీవే అని చెప్పుకోకపోయినా ఆ పోస్టులు చూసిన వాళ్లకు సులభంగానే ఆ విషయం అర్థమవుతోంది.
సోషల్ మీడియాలో అనుకూలంగా ప్రచారం జరగడం కోసం వైసీపీ కన్వీనర్లను, కో కన్వీనర్లను నియమించింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన వాళ్లు ఇప్పుడు సైలెంట్ కావడం గమనార్హం. వైసీపీ కోసం ఎంత కష్టపడినా పార్టీ నుంచి తమకు కావాల్సిన సపోర్ట్ అయితే అందలేదని వాళ్లు భావిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాపై దృష్టి పెట్టడం వెనుక ప్రశాంత్ కిషోర్ టీం ఉందని తెలుస్తోంది.
ప్రశాంత్ కిషోర్ టీం సూచన మేరకు వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ ను నియమించుకునే దిశగా అడుగులు వేస్తోంది. అయితే సోషల్ మీడియాలో పాజిటివ్ గా ప్రచారం చేసుకున్నంత మాత్రాన ప్రజల మెప్పు పొందకపోతే పెద్దగా ప్రయోజనం చేకూరదనే సంగతి తెలిసిందే. వైసీపీ ప్రజల మనస్సులను గెలుచుకునే దిశగా అడుగులు వేస్తే మంచిదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
వైసీపీకి 2024 ఎన్నికల్లో గెలవడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఎలాంటి తప్పు జరగకుండా వైసీపీ చర్యలు చేపడితే మంచిదని చెప్పవచ్చు. వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ కు తగిన ప్రాధాన్యత ఇస్తే భవిష్యత్తులో కూడా వాళ్లు కొనసాగే ఛాన్స్ అయితే ఉంటుంది. జగన్ సర్కార్ వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం లాభం కంటే నష్టం ఎక్కువని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.