మార్గదర్శి స్కామ్.! టీడీపీ ఎందుకు వణుకుతోంది.?

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, మార్గదర్శి స్కామ్‌లో పీకల్లోతు కూరుకుపోయారు. సరే, ఈ ‘స్కామ్ ఆరోపణల’ వెనుక రాజకీయ కోణం వుందా.? లేదా.? అన్నది వేరే చర్చ.

న్యాయస్థానాల్లో కేసులు విచారణ దశలో వున్నాయి.. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుపోతున్నాయి. రేపో మాపో రామోజీరావు అరెస్టవుతారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడాన్ని తప్పు పట్టలేం. అది రాజకీయం.! కానీ, టీడీపీ ఎందుకు ఉలిక్కిపడుతోంది.

ఓ మీడియా సంస్థ అధినేత, ఓ చిట్‌ఫండ్ వ్యాపారి విషయంలో ఎందుకింతలా తెలుగుదేశం పార్టీ బాధపడిపోతోంది.? ఓహో, రామోజీరావు, చంద్రబాబుకి రాజగురువు కావడం వల్లేనా.? తెలుగుదేశం పార్టీ ఎలా వుండాలో, ఏం చేయాలో.. నిర్ణయించేది రామోజీరావేనన్న ప్రచారం ఈనాటిది కాదు.

స్వర్గీయ ఎన్టీయార్‌కి చంద్రబాబు రాజకీయ వెన్నుపోటు పొడవడంలో, తెరవెనుకాల వ్యూహ రచన చేసిందే రామోజీరావు.. అన్న వాదనలూ లేకపోలేదు. అంతలా, చంద్రబాబుకి సహకరించిన రామోజీరావుకి కష్టమొస్తే, టీడీపీ శ్రేణులు ఆగుతాయా.?

అందుకే, తెలుగు జాతి ఆత్మగౌరవం లెక్కల్లోకి రామోజీరావుని కూడా తీసుకొచ్చేశారు. అసలు తెలుగునాట జర్నలిజం పుట్టిందే రామోజీరావు.. అంటూ ట్వీట్లతో హోరెత్తించేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇదంతా రామోజీరావు మీద ప్రేమతోనే అనుకుంటే పొరపాటు. మార్గదర్శి స్కామ్‌లో తీగ లాగితే, టీడీపీ డొంక కదిలేలా వుందిట.!

అందుకే, టీడీపీ వణుకుతోంది. వణకాల్సిందే.! ఎక్కడ నొక్కితే, టీడీపీ వణుకుతుందో వైఎస్ జగన్ అర్థం చేసుకున్నట్టున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా చెయ్యలేకపోయినది, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారా.? అంతేనేమో.!