రామోజీ, శైలజాలకు బిగ్‌ షాక్‌.. ఫాం లో ఉన్న సీఐడీ కీలక నిర్ణయం!

ప్రస్తుతం పక్కా ఆధారలతో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో భాగంగా మాజీ ముఖ్యమంత్రిని అదుపులోకి తీసుకుని, కోర్టు అనుమతితో రిమాండ్ కు తరలించగలిగింది ఏపీ సీఐడీ. సుమారు మూడేళ్లుగా దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించేపనిలో పట్టువదలని విక్రమార్కుల్లా ఏపీ సీఐడీ అధికారులు శ్రమించారని, సగం సక్సెస్ అయారని అంటున్నారు! ఈ సమయంలో అదే ఫాం ని మార్గదర్శి విషయంలోనూ కంటిన్యూ చేసే ధోరణిలో ఉన్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా తాజాగా మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీరావు, శైలజా కిరణ్‌ లతో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు కీలక వ్యక్తులు, ఉద్యోగులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఇందులో భాగంగా సుమారు 15 మందికి నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్‌ లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు “రిటర్న్‌” చేస్తూ గత నెల 28న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతొ ఆ రిటర్న్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం రామోజీరావు, శైలజా కిరణ్, ఆడిటర్‌ కుదరవల్లి శ్రవణ్‌ లతో పాటు మొత్తం 15 మందికి నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈ క్రమంలో తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది హైకోర్టు. ఈ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.

కాగా… డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసిన అనంతరం… వీటిని పరిశీలించిన ప్రత్యేక కోర్టులు గుంటూరులో ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి, విశాఖపట్నంలో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఈ రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించాయి. ఈ అప్పీళ్లపై హైకోర్టులో తాజాగా విచారణ జరిపి… తదుపరి విచారణను సెప్టెంబర్ 18 కి వాయిదా వేశారు!