అరెస్టవుతానని తెలిసీ, చంద్రబాబు ఎందుకు జాగ్రత్త పడలేదు.?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టుని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇందులో వింతేముంది.? చంద్రబాబు, అరెస్టులకు అతీతం.. అని కదా, టీడీపీ నమ్మేది. పైగా, నేను నిప్పు.. అని చెప్పుకుంటుంటారు చంద్రబాబు. నిన్నే విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా, ‘మచ్చలేని చంద్రుడు’ అని సర్టిఫికెట్ ఇచ్చారు కూడా. అది వెటకారం.. అని చంద్రబాబు అరెస్టుతో తేలిపోయింది.

కాగా, గత కొద్ది రోజులుగా చంద్రబాబు ‘నన్ను అరెస్టు చేయండి మీకు చేతనైతే..’ అంటూ సవాల్ విసురుతున్నారు. అదే సమయంలో, ‘రేపో మాపో నన్ను అరెస్టు చేస్తారు..’ అని చంద్రబాబు పార్టీ శ్రేణుల్ని తదనుగుణంగా సిద్ధం చేశారు కూడా. సాధారణంగా అయితే, అరెస్టుని తప్పించుకోవడానికి చంద్రబాబు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటుంటారు.

వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. కానీ, ఈసారి చంద్రబాబుకి ఆ ఛాన్స్ దొరకలేదు. అరెస్టుని చంద్రబాబు తప్పించుకోలేకపోయారు. కానీ, ఇదెలా సాధ్యమయ్యింది.? చంద్రబాబు కనీసం ముందస్తు బెయిల్ కోసం ఎందుకు దరఖాస్తు చేసుకోలేకపోయారు.? ఇదే అందర్నీ ఆశ్చర్యపరుస్తోన్న ప్రశ్న.

కేవలం సింపతీ కోసమే చంద్రబాబు అరెస్టవ్వాలనుకున్నారు.. ఆయన కోరికని వైఎస్ జగన్ తీర్చేశారు.. అన్న వాదనా వినిపిస్తోంది. మరి, చంద్రబాబుకి ఆ స్థాయిలో ఆయన కోరుకున్న విధంగా సింపతీ వస్తుందా.? రాజకీయాలు మారాయ్.. ఒకప్పటిలా సింపతీ ఇప్పుడు వర్కవుట్ అయ్యే అవకాశం కన్పించడంలేదు.

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు హంగామా చేయడం మామూలే. కానీ, కొందరు టీడీపీ నేతలు ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకుంటున్నారట. మేనేజ్ చేసుకోగలిగీ, చంద్రబాబు ఎందుకు అరెస్టయ్యారో వారికీ అర్థం కాకపోవడమే అందుక్కారణమని అంటున్నారు.

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. చంద్రబాబు ఏంటయ్యా ఇలా అరెస్టవడం.?