రాజకీయాలు వింత పోకడులు పోతున్నాయనటానికి ఈ స్టేట్మెంటే నిదర్శనం. ఈయన మాజీ ఎంఎల్ఏ మధుసూధనగుప్తా. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేయటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డికి ప్రధాన మద్దతుదారుడు కూడా లేండి. ఆ అర్హతతోనే టిడిపిలో చేరి టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇక్కడ విచిత్రమేమిటంటే టిడిపి సిట్టింగ్ ఎంఎల్ఏ జితేంద్రగౌడ్ ఉన్నారు. గౌడ్ ను జేసి బ్రదర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తు గుప్తాను ప్రమోట్ చేస్తున్నారు. అందుకనే గుప్తా రాకను గౌడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఎంత వ్యతిరేకించినా టిడిపిలోకి గుప్తా ఎంట్రీని ఆపలేకపోయారు. టిడిపిలో చేరిన తర్వత మొదటిసారిగా గుప్తా గుంతకల్లులోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. అప్పుడు రెండు వర్గాల మధ్య పెద్ద గొడవైంది. ఆ సందర్భంగానే గుప్తా మర్డర్ల గురించి బహిరంగంగా ప్రత్యర్ధులను హెచ్చరించారు.
తనను భయపెట్టాలని కొందరు చూస్తున్నారని అది సాధ్యం కాదన్నారు. వాళ్ళ పప్పులు తన దగ్గర ఉడకవని కూడా హెచ్చరించారు. ‘ఫ్యాక్షన్, మర్డర్లు వాళ్ళకు కొత్తోమో గానీ తనకు కాద’ని గుప్తా చేసిన హెచ్చరికలతో అందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. పార్టీ కార్యాలయంలోకి ఎంటరైన గుప్తాను గౌడ్ మద్దతుదారులు వెనక్కు వెళ్ళిపొమ్మన్నారు. దానికి గుప్తా మాట్లాడుతూ, ‘ తాను ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని ఏనికైనా సవాల్ ’అంటూ ఛాలెంజ్ చేయటం జిల్లాలో పెద్ద చర్చనీయాంశమైంది.