బాబు పాదయాత్ర చేస్తే బెటర్.. లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపికి నష్టమేనా?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ తెలుగుదేశం అధికారంలోకి రావాలని పాదయాత్రకు సిద్ధమయ్యారు. కుప్పం నియోజకవర్గం నుంచి లోకేశ్ పాదయాత్ర చేయనున్నారని సమాచారం అందుతోంది. 2023 సంవత్సరం జనవరి నుంచి లోకేశ్ పాదయాత్ర జరగనుందని తెలుస్తోంది. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచినా లోకేశ్ నాయకత్వాన్ని ఒప్పుకునే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరు.

చంద్రబాబు ఈ విషయానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే. మరోవైపు లోకేశ్ కు 2024 ఎన్నికలు కీలకం కానున్నాయి. ఈ ఎన్నికల్లో లోకేశ్ కనీసం ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. మంత్రి రోజా సైతం అటు లోకేశ్ ఇటు పవన్ లను ఈ విషయంలో అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. లోకేశ్ పాదయాత్ర టీడీపీకి ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు పాదయాత్ర చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. నారా లోకేశ్ అన్నీ ఆలోచించుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది. పాదయాత్రలో లోకేశ్ పొరపాటుగా కామెంట్లు చేస్తే మాత్రం టీడీపీ మునుగుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. లోకేశ్ పాదయాత్రకు బదులుగా మరో విధంగా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

లోకేశ్ కు బదులుగా చంద్రబాబు పాదయాత్ర చేస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పాదయాత్ర చేయడం ద్వారా సింపతీ ఫ్యాక్టర్ కూడా వర్కౌట్ అవుతుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోకేశ్ పాదయాత్ర టీడీపీకి నష్టం కలిగిస్తే మాత్రం 2024 ఎన్నికల్లో కూడా 23 కంటే తక్కువ ఎమ్మెల్యే స్థానాలకు టీడీపీ పరిమితమయ్యే ఛాన్స్ అయితే ఉంది.