వైఎస్ వివేకా డెత్ మిస్టరీ.! వైఎస్ జగన్‌కి నారా లోకేష్ తాజా సవాల్.!

కొన్నాళ్ళ క్రితం తిరుపతి వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు.. వైఎస్ వివేకాంద రెడ్డి మర్డర్ మిస్టరీకి సంబంధించి. ‘వైఎస్ వివేక హత్య కేసుతో మీకుగానీ, మీ కుటుంబ సభ్యులకుగానీ సంబంధం లేదని ఆ వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేయగలరా.?’ అన్నది నారా లోకేష్ విసిరిన సవాల్ తాలూకు సారాంశం.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల కోసం తిరుపతి వెళుతున్న తరుణంలో, అత్యంత వ్యూహాత్మకంగా నారా లోకేష్, ఆ పాత సవాల్‌ని ఇంకోసారి తెరపైకి తెచ్చారు. వైఎస్ వివేకా హత్య చంద్రబాబు హయాంలోనే జరిగింది.. అదీ ఎన్నికల సమయంలో.

వైఎస్ జగన్ కావొచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావొచ్చు.. వీరెవరికైనా ఆ హత్య కేసుతో సంబంధం వుందని టీడీపీ భావించి వుంటే, అప్పట్లోనే అరెస్టులు జరిగి వుండేవి కదా.? పోనీ, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.. అనుకుంటే, పోనీ.. టీడీపీ ఏమన్నా ఈ విషయమై కోర్టును ఆశ్రయించిందా ఆ తర్వాత.? లేదు కదా.!

వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ మిస్టరీ సంగతి పక్కన పెడదాం. స్వర్గీయ ఎన్టీయార్‌ని హత్య చేశారని స్వయానా ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలు కూడా చంద్రబాబు మీదనే చేస్తున్నారు. చంద్రబాబు ఈ విషయమై అదే తిరుపతిలో ప్రమాణం చేసి చెప్పగలరా, స్వర్గీయ ఎన్టీయార్ వెన్నుపోటు వ్యవహారంలో తనకేమీ సంబంధం లేదని.?
రాజకీయాలంటే సవాళ్ళు, ప్రతిసవాళ్ళు మాత్రమే కాదు.!

ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిస్సిగ్గు రాజకీయాలు చేయడం ప్రజా సేవ అనిపించుకోదు. ప్రజలకు వాస్తవాలు చెప్పగలిగే ధైర్యం వుందా.? అన్నదే అసలు ప్రశ్న. తన తండ్రి చంద్రబాబుని తిరుపతి తీసుకెళ్ళి, ‘ఆనాటి వెన్నుపోటుతో సంబంధం లేదు’ అని ప్రమాణం చేయించి, ఆ తర్వాత నారా లోకేష్, వైఎస్ జగన్‌కి సవాల్ విసిరితే బావుంటుందేమో.!