సంచలనం: టిడిపి కంచుకోటల్లో వైసిపి అభ్యర్థుల లిస్ట్ ఇదే

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. నవరత్నాల పధకం గెలవటానికి ప్రధాన భూమిక పోషిస్తుందని జగన్, పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. అంతేకాదు అభ్యర్థుల ఎంపికలోనూ ఆయన కసరత్తులు చేస్తున్నారు. సర్వేలు చేయించి గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అనవసరమైన మొహమాటాలకు పోకుండా ఎవరైతే గెలుస్తారు అని గట్టిగా నమ్ముతున్నారో వారికే సీట్లు కట్టబెడుతున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన తీవ్ర సంచలనాలు సృష్టించింది కూడా. ఎప్పటి నుండో పార్టీలో ఉన్న నాయకులను పక్కన బెట్టి కొత్తవారికి సీట్లు కేటాయించడంతో ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్న నేతలు అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే. కానీ జగన్ మాత్రం అభ్యర్ధుల కేటాయింపులో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో ముక్కుసూటి ధోరణి వహిస్తున్నట్టు స్పష్టం అవుతోంది.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలన్న కసితో ఉన్న జగన్ ఉభయ గోదావరి జిల్లా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ప.గో జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇక్కడ వైసిపి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. తూ.గో.లో 19 అసెంబ్లీ స్థానాలుంటే వైసిపి 5 స్థనాలని గెలుచుకుంది. ఆ తరువాత ఆ ఐదుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు టిడిపిలోకి జంప్ అయ్యారనుకోండి… ఈసారి మాత్రం గోదావరిజిల్లాల్లో పార్టీ గెలుపును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జగన్. టిడిపి కంచుకోటను ఎలాగైనా బద్దలు గొట్టాలని అభ్యర్థులను ఆచి తూచి ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఉభయ గోదావరి జిల్లాల్లో అసెంబ్లీ స్థానాలు 34 ఉండగా ఇప్పటికే 15 స్థానాలకు అభ్యర్థులను కేటాయించినట్టు తెలుస్తోంది ఇందులో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉండగా మిగిలిన 19 మంది ఎంపికపై కసరత్తు చేసి జగన్ పాదయాత్ర ముగియగానే ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా కింద ఉంది చూడండి.

తూర్పు గోదావరి జిల్లా

 

    నియోజకవర్గం

    అభ్యర్థి
1 అన‌ప‌ర్తి సూర్య‌నారాణ రెడ్డి
2 అమ‌లాపురం పి. విశ్వ‌రూప్
3 కొత్త‌పేట‌ చిర్ల జ‌గ్గిరెడ్డి (సిట్టింగ్)
4 రాజ‌మండ్రి సిటీ రౌతు సూర్యప్రకాష్ రావు
5 కాకినాడ రూర‌ల్ కుర‌సాల క‌న్న‌బాబు 
6 రంప‌చోడ‌వ‌రం ధ‌న‌ల‌క్ష్మీ
7 ముమ్మిడివ‌రం పొన్నాడ స‌తీష్
8 తుని దాడిశెట్టి రాజా (సిట్టింగ్)

 

పశ్చిమ గోదావరి జిల్లా

 

    నియోజకవర్గం

    అభ్యర్థి
1 త‌ణుకు కారుమూర్తి నాగేశ్వ‌ర‌రావు
2 కొవ్వూరు తానేటి వ‌నిత‌
3 పోల‌వ‌రం బాల‌రాజు
4 భీమ‌వ‌రం గ్రంధి శ్రీనివాస్
5 న‌ర్సాపురం ముదునూరి ప్రసాదరాజు 
6 తాడేప‌ల్లిగూడెం కోట స‌త్య‌నారాయ‌ణ‌
7 ఆచంట‌ రంగ‌నాధ‌రాజు