ఏపీలో నిన్న వెయ్యి లోపు కరోనా పాజిటివ్ కేసులు… కారణమేంటంటే?

Less than a thousand positive corona cases were reported in the AP yesterday

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో వెయ్యి లోపు కొత్త కరోనా కేసులు నమోదవడం ఆశ్చర్యంగానే ఉంది. ఇండిపెండెన్స్ డే సందర్బంగా నిన్న చేసిన కరోనా పరీక్షల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు మూల కారణమని తెలుస్తుంది. వివరాలలోకి వెళితే నిన్న 46,962 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 909 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 19,91,711 కి చేరింది. కరోనా కారణంగా చిత్తూరు 3, కృష్ణ 2, గుంటూరు 2, ప్రకాశం 2, కడప 1,నెల్లూరు 1, తూర్పుగోదావరి 1, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున ​మొత్తం 13 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,660 కి చేరింది.

Less than a thousand positive corona cases were reported in the AP yesterday
 

కరోనాబారి నుంచి నిన్న 1,543 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19,63,728 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 17,218 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,57,08,411 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే… అనంతపూర్-05, చిత్తూరు-107, ఈస్ట్ గోదావరి-241, గుంటూరు- 82, కడప- 40, కృష్ణ- 47, కర్నూల్- 08, నెల్లూరు-174, ప్రకాశం- 86, శ్రీకాకుళం- 28, విశాఖపట్నం- 61, విజయనగరం- 09, వెస్ట్ గోదావరి-21 చొప్పున కేసులు నమోదయ్యాయి.

గమనిక: కరోనాను కట్టడికి ప్రస్తుతం వాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. భౌతిక దూరం పాటించండి, మాస్క్ ధరించండి, చేతులను శుభ్రంగా శానిటైజ్ చేసుకోండి.