సచివాలయంలో జలపాతాలు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తొలి రోజున  బిజెపి సభ్యులు వినూత్న నిరసన తెలిపారు. గొడుగులు, రెయిన్ కోట్లతో వచ్చి  సచివాలయమా, జలపాతమా అని రాసిన ప్లకార్డు ప్రదర్శిస్తూ , తత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణంలో జరిగిన లోపాలకు  నిరసన తెలిపారు.  వందలకోట్లు ఖర్చు పెట్టిన సచివాలయం లీకయి, వర్షపు నీరు కారుతూ జలపాతాలను తలపిస్తూ ఉందని వారు అన్నారు. చదరపు అడుగు పదివేల రుపాయలు ఖర్చు పెట్టించి కట్టిస్తే చివరకు మిగిలింది లీకేజీలా అని ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ‘తెలుగు రాజ్యం’ తొోొ మాట్లాడుతు వరల్డ్ క్లాస్ రాజధానిలో వరల్డ్ క్లాస్  కుంభకోణమని అసెంబ్లీ నిర్మాణం గురించి వ్యాఖ్యానించారు.

ఇటీవల కురిసిన వర్షాలకు సచివాలయం, అసెంబ్లీ, మంత్రుల కార్యాలయాలు అంతా లీకులమయంగా మారిందని ,మళ్లీ వర్షాలు పడితే తడుస్తామన్న ముందస్తు ఆలోచనతో గొడుగులు తెచుకున్నామని  ఆయన అన్నారు.

ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం లో చంద్రబాబు, వాళ్ళ సర్కారు మించిన నాయకులు లేరుని సత్యనారాయణ  విమర్శించారు.