పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ అధిక్యత ప్రదర్శిస్తుంది. టిఆర్ఎస్ 21 స్థానాల్లో, కూటమి 18 స్థానాల్లో ముందంజలో ఉంది. మక్తల్, తుంగతుర్తి, సిరిసిల్ల, హుజూరాబాద్, జగిత్యాల నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. సూర్యాపేటలో కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి 214 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు.
వర్దన్న పేటలో కూడా టిఆర్ఎస్ ముందంజలో ఉంది. తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్ది అద్దంకి దయాకర్ ముందంజలో ఉన్నారు. ముథోడ్ లో కూడా టిఆర్ ఎస్ ముందంజలో ఉంది. సిద్దిపేటలో హరీష్ రావు 13 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పరకాలలో టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నది. ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి బిఎస్సీ అభ్యర్ధి ముందంజలో ఉన్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్ధి సబితా ఇంద్రారెడ్డి ముందంజలో ఉన్నారు. మిర్యాలగూడలో కూటమి నేత ఆర్. కృష్ణయ్య ముందంజలో ఉన్నారు. కొడంగల్ లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ లో టిఆర్ఎస్ ముందంజలో ఉంది. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ది ముందంజలో ఉన్నారు. ములుగులో కాంగ్రెస్ అభ్యర్ధి సీతక్క ముందంజలో ఉన్నారు. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ ముందంజలో ఉన్నారు. ఎల్లారెడ్డి, కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో ఉంది. బాన్సువాడలో టిఆర్ఎస్ అధిక్యంలో ఉంది. సత్తుపల్లిలో టిడిపి అధిక్యం ఉంది. సత్తుపల్లిలో టిడిపి సండ్ర వెంకట వీరయ్య అధిక్యంలో ఉన్నారు. పాడేరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధిక్యంలో ఉన్నారు.
కొల్లాపూర్ లో టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. తాండూర్ లో టిఆర్ ఎస్ ఆధిక్యంలో ఉంది. గద్వాల్ లో టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. దేవరకొండలో టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. వనపర్తిలో టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. హూజూర్ నగర్ లో ఉత్తమ్ ముందంజలో ఉన్నారు. గోషామహాల్ లో బిజెపి ఆధిక్యం ముందంజలో ఉన్నారు. నల్లగొండ, మునుగోడు లో కోమటిరెడ్డి బ్రదర్స్ ముందంజలో ఉన్నారు. రామగుండంలో ఇండిపెండెట్ ముందంజలో ఉన్నారు. నాగార్జున సాగర్ లో టిఆర్ఎస్ నోముల నర్సింహ్మయ్య ముందంజలో ఉన్నారు.
నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ లలో కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శిస్తుంది. 53 స్థానాల్లో టిఆర్ఎస్ ముందంజ, 31 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నారు.