కొందరు వ్యక్తులు క్యాజువల్ గా కలిసినా చూసేవాళ్లకు చాలా ఆసక్తిగా ఉంటుంది. అక్కడేదో జరిగిపోతున్న ఫీల్ వస్తుంది. అదే ఇప్పుడు ఎన్టీఆర్, కేటీఆర్ కలిసి ఉన్న ఫొటో వైరల్ అవ్వటానికి కారణం అయ్యింది. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సినిమావాళ్లతో మొదటి నుంచి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్న కేటీఆర్…ఎన్టీఆర్ ని ఇంతకు ముందు కలిసి ఉండవచ్చేమో కానీ ఆ ఫొటోలు,వార్తలు ఇంతకు ముందు బయిటకు రాలేదు. ఈ నేఫద్యంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ కలవటం వార్తగా మారింది. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ ప్రైవేట్ పార్టీలో ఈ ఇద్దరు కలిసినట్లు తెలుస్తుండగా.. ఈ కలయిక ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల మీదనే ఫోకస్‌ను పెట్టడంతో ఈ కలయికలో రాజకీయ యాంగిల్ వెతకం అనవసరం.
ఇక తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఎన్టీఆర్.. టీడీపీ తరఫున కూకట్‌పల్లి నుంచి నిలిచిన తన సోదరి సుహాసికి మద్దతును పలికాడు తప్ప.. ప్రచారం చేయలేదు. ఆ తరువాత సుహాసినితో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ఘోర పరాజయం పాలవ్వగా.. ఈ ఇద్దరు కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.