అయ్యగారికి సీటు లేదట.! అమ్మగారిదే పెత్తనమట.!

వైసీపీలో కీలక నాయకుడాయన. కీలక పదవిలో కూడా వున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడు ఆయన. ఉన్నత పదవిలో వున్నా, రాజకీయాలు మాట్లాడకూడని పదవిలో వున్నా, ఎడా పెడా రాజకీయాలు మాట్లాడేస్తుంటారు, అభ్యంతకర వ్యాఖ్యలూ చేస్తుంటారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సదరు వైసీపీ నేత ఇష్టపడటం లేదట. ఈ విషయాన్ని గతంలోనే అధినేతకు వివరించారట. ఈసారికి మంత్రి పదవి ఇచ్చెయ్యండి.. ప్రత్యక్ష రాజకీయాల్నీ వదిలేస్తానని మొరపెట్టుకుంటున్నా ఆయనకి పని జరగడంలేదని వినికిడి.

‘ఈసారికి అయ్యగారు పోటీ చెయ్యరట.. అమ్మగారిదే పెత్తనమట..’ అంటూ ఆయనగారి నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఆమె ఏమీ నియోజకవర్గ స్థాయి నేత కాదు. కానీ, ‘పవర్ సెంటర్’ అని అంటున్నారు.

ఏమో, నిజమెంతోగానీ.. ఈ మధ్య మహిళా నాయకులు వైసీపీలో పైకొస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బదులుగా ఆయన సతీమణి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా దువ్వాడ శ్రీనివాస్‌ని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే, ఆయన మాత్రం ‘నేను కాదు, నా భార్య పోటీ చేస్తారు’ అని ఇటీవల ప్రకటించారు. ఇంతకీ, వైసీపీలో ఏం జరుగుతోందబ్బా.? ఈ మహిళామణుల పోరు ఎందుకబ్బా.?