వైరల్ : పవన్ పాలిటిక్స్ పై “కొమరం పులి” హీరోయిన్ సెన్సేషనల్ స్టేట్మెంట్.!

తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద సెలెబ్రెటీనో అందరికీ తెలుసు. అటు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కూడా భారీ ప్రజాకర్షణ పవన్ సొంతం. అలాగే పవన్ కి సేవ దృక్పధం కూడా ఒకింత ఎక్కువే అని కూడా అందరికీ తెలుసు.

తాను సంపాదించుకునేది ఎంత అయినా కూడా పవన్ సాయం అడిగితే లేదనకుండా చేసేస్తాడు. ఇక ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన సొంత డబ్బు ఏకంగా 30 కోట్లు దానం చేస్తున్నాడు. తన పొలిటికల్ టూర్ లో భాగంగా ఇప్పుడు కౌలు రైతులకి ఒక్కో కుటుంబంకి లక్ష రూపాయల చెక్ ని అందజేస్తున్నారు.

మరి ఇది నేషనల్ మీడియా కూడా కవర్ చేయగా దీనిపై పవన్ తో నటించిన హీరోయిన్ కొమరం పులి ఫేమ్ నికిషా పటేల్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో అందించింది. “పవన్ కళ్యాణ్ గొప్ప మనసున్న వ్యక్తి అని నా మాట నమ్మండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మంచి భవిష్యత్తు అందిస్తాడు” అని..

ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీనితో అయితే ఈ పోస్ట్ ఇప్పుడు మంచి వైరల్ గా మారింది. మొత్తానికి అయితే పవన్ విషయంలో ఆమె ఈ విధంగా తన అభిప్రాయాన్ని చెప్పింది. మరి దీన్ని ప్రజలు ఎంతవరకు తీసుకుంటారో చూడాలి.