ఎన్టీఆర్ జయంతి స్పెషల్: కొడాలి వీర ఉతుకుడు!

రాజమండ్రిలోని వేమగిరి వద్ద అట్టహాసంగా జరుగుతున్న టీడీపీ మహానాడుపై ఇప్పటికే వైసీపీ నేతలంతా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరితర్వాత ఒకరు వాయించేశారు. మహానాడు వేదికపై టీడీపీ నేతలు చేసిన విమర్శలన్నింటికీ సమాధానాలు చెబుతూ… తమ్ముళ్లకు ఉక్కబోత పెట్టించేశారు. అయితే ఉతుకుళ్లందు కొడాలి ఉతుకుడు వేరయా అన్నట్లుగా తాజాగా మైకందుకున్నారు మాజీ మంత్రి కొడాలి నాని!

మహానాడుపై ఇప్పటికే వైసీపీ నేతలు బాబుని ఉతికి ఉతికి వదిలిన నేపథ్యంలో… ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా స్పెషల్ రౌండ్ వేసుకున్నారు కొడాలి నాని. గతంలో కంటే మరింత డోస్ పెంచిన కొడాలి… చంద్రబాబు, లోకేష్ ని చెడామడా తిడుతూ… మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి అచ్చెన్నను ఆడుకున్నారు. ప్రస్తుతం కొడాలి వ్యాఖ్యలు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి!

ఎన్టీఆర్ పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదన్న కొడాలి నాని… తెలంగాణలో పార్టీని చంపేసి, ఏపీలో నాలుగు జిల్లాలకు పార్టీని పరిమితం చేశారని దుయ్యబట్టారు. 2019లో ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న బాబు… ఇక సొంతగా గెలవలేమని తెలుసుకుని పవన్ కల్యాణ్, సీపీఐ, సీపీఎం ల %$#@& నాకుతున్నారని ఎద్దేవా చేశారు! 2024 ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు – లోకేష్ లు కర్ణాటక, తమిళనాడు బోర్డర్ లో హెరిటేజ్ కోవాలు ప్లేట్ లో పెట్టుకుని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు.

అనంతరం అచ్చెన్నవైపు టర్న్ అయ్యారు కొడాలి! “తాజాగా జగన్ సెంటు పట్టా ఇచ్చారు. నా లాగా పొడవుగా ఉండే వాడికి సెంటు పట్టా సరిపోతుందా..?” అంటూ అమరావతిలో పేదలకు జగన్ ఇచ్చిన సెంటు భూమిపై సెటైర్లు వేసిన అచ్చెన్నాయుడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అచ్చెన్నాయుడికి ఇల్లు సరిపోదని, పశువుల పాక కావాలని, ఆయన గడ్డివాము వేసుకోడానికి కూడా సెంటు భూమి సరిపోదని మండిపడ్డారు. % $#@& అవతారం వేసుకున్న స్క్రాప్ నా పుత్రులంతా మహానాడు పెట్టుకున్నారని కొడాలి ఫైరయ్యారు!

ప్రస్తుతం కొడాలి నాని మాట్లాడిన ఈ వీడియోల కింద కామెంట్లలో “వీర ఉతుకుడు”, “మహానాడు స్పెషల్”, “ఎన్టీఆర్ జయంతి స్పెషల్” అని కామెంట్లు కనిపిస్తుండటం కొసమెరుపు!