రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అతంత సహజం. కాకపోతే ఈ మధ్యకాలంలో అవి కాస్త శృతిమించాయని పలువురు అభిప్రాయపడుతుంటే… అవతలి మనిషి క్యారెక్టర్ ని బట్టి డోస్ లో హెచ్చుతగ్గులు ఉంటాయని ఇంకొంతమంది చెబుతుంటారు. ఇక ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వర్సెస్ మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని జరిగే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చంద్రబాబు పేరు చెబితే కొడాలి నాని అంతెత్తున లేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఒక ఛాలెంజ్ చేశారు కొడాలి నాని!
అవును… ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార కార్యక్రమాలతో పాటు, విమర్శలు ప్రతి విమర్శల వాతవారణం కూడా వేడెక్కుతుంది. అడ్డగోలు విమర్శలు కాకుండా.. అర్ధవంతమైన స్పష్టతతో కూడిన విమర్శల వైపు నేతలు మల్లుతున్నట్లు కనిపిస్తుంది. మరోపక్క కొంతమంది నేతలు ఛాలెంజ్ లు చేస్తున్నారు.. ఇంకొంతమంది రుజువులు పట్టుకుని తిరుగుతున్నారు. ఇంకొంతమంది చరిత్ర గుర్తు చేస్తూ.. వర్తమానాన్ని పోల్చి చూపిస్తున్నారు ఈ సమయంలో కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
గుడివాడలో ఎన్నికల ప్రచారంలో పాగొన్న మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. మరోసారి చంద్రబాబుపై నిప్పులు చేరిగారు. ఇదే సమయంలో ఇళ్లపట్టాల విషయంలో ఛాలెంజ్ చేశారు. ఇందులో భాగంగా… అర్హత ఉండి గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ సహాయం అందలేదు.. ఇళ్ల స్థలాలు రాలేదని ఏ ఒక్కరితో చెప్పించినా తాను ఎన్నికల్లో పోటీ చేయనని కొడాలి నాన్ని సవాల్ చేశారు. దీంతో… ఈ స్థాయిలో ఛాలెంజ్ చేయడం సామాన్యమైన విషయం కాదని అంటున్నారు పరిశీలకులు.
ఈ సందర్భంగా మరింత స్పందించిన కొడాలి నాని… పేదల ఇళ్ల స్థలాల అప్పును రద్దు చేసిన చరిత్ర జగన్ సొంతమంది చెప్పారు. ఇదే సమయంలో… 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో అప్పు రద్దు చేసి, పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలను పూర్తిగా వదిలేస్తానని నాని సవాల్ చేశారు. చంద్రబాబు పాలనలో కనీసం లోన్లు కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే మళ్లీ సీఎం అయ్యాక.. టిడ్కో లబ్ధిదారులను రుణ విముక్తులను చేస్తామని కొడాలి నాని హామీ ఇచ్చారు.
ఇలా… తన నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారిని, ప్రభుత్వ ఇళ్ల పట్టాలు దక్కనివారిని ఒక్కరిని చూపించినా తాను ఎన్నికల్లో పోటీ చేయకుడా తప్పుకుంటానని కొడాలి నాని చేసిన సవాల్ చిన్న విషయం కాదని… తాము చేసిన పనిమీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప అలాంటి ఛాలెంజ్ లు చేయడం అసాద్యం అని అంటున్నారు పరిశీలకులు. కాగా… జూన్ 4 తర్వాత ఏపీలో చంద్రబాబు పేరు ప్రస్థావించే వ్యక్తి ఎవరూ ఉండరంటూ ఇటీవల కొడాలి నాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే!