పవన్ ని కలుద్దామనుకున్న కొడాలి నాని… రాజకీయంగా బట్టలూడదీసి…!

చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే వైసీపీ నేతల్లో కొడాలి నాని స్టైలే వేరని అంటుంటారు. మొదటినుంచీ నందమూరి కుటుంబంతో సన్నిహితంగా ఉండటం.. హరికృష్ణ కు అనుచరుడిగా ఉండటం, ఎన్టీఆర్ కు శిష్యుడిగా ఉండటం, జూనియర్ ఎన్టీఆర్ కు గార్డియన్ గా ఉండటం తెలిసిందే. దీంతో చంద్రబాబు గురించి కూడా కొడాలికి పూర్తిగా తెలుసని అంటుంటారు. ఫలితంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించాల్సి వచ్చినప్పుడు డిటైల్డ్ గా మొదలుపెడతారు కొడాలి నాని.

అవును… చంద్రబాబును రాజకీయాలనుంచి శాస్వతంగా ఇంటికి పంపించేవారకూ తాను ఈ భూమి వదిలి వెళ్లనని తీవ్రస్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని… తాజాగా మరోసారి ఫైరయ్యారు. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో చంద్రబాబు విచిత్ర విన్యాసాలు చేస్తున్నాడని.. స్వాతంత్రం వచ్చాక ఎక్కువ కాలం ఏపీలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌, టీడీపీలేనని.. కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ అడ్డమైన పనులు చేశాడని, చివరకు ఎన్టీఆర్‌ కాళ్లు ప్టటుకుని టీడీపీలో చేరాడని గతం గుర్తుచేసే ప్రయత్నం చేశారు నాని.

1978 నుంచి అంటే.. 40 ఏళ్లపాటు ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు కీలకంగా ఉన్నారు. అన్నేళ్లు అధికారం అనుభవించి ఎందుకు ప్రాజెక్టులు కట్టలేకపోయాడని కొడాలి నాని నిలదీశారు. ఇదే సమయంలో పోలవరానికి జాతీయ హోదా తెచ్చిన ఘనత వైఎస్సార్‌ ది అని చెప్పిన కొడాలి నాని… చంద్రబాబు తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో గ్రాఫిక్స్ లో పోలవరం కట్టారని ఎద్దేవా చేశారు. పోలవరానికి కనీసం రూ.100 కోట్ల పనులు చంద్రబాబు చేయలేకపోయారని దుయ్యబట్టారు.

ఇదే సమయంలో మంత్రులతోపాటు ఏపీ ప్రజానికం కూడా చంద్రబాబుని నిలదీస్తున్న ప్రశ్ననే కొడాలి నాని కూడా వేశారు. ఇందులో భాగంగా.. కేంద్రం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు చేతుల్లోకి తీసుకున్నారు అని అడిగారు. ఇది ప్రస్తుతం అత్యంత కీలకమైన ప్రశ్నగా ఉంది. ఈ విషయంలో బాబు దోషిగా మరోమారు ఏపీ ప్రజలముందు నిలబడే పరిస్థితి ఉందన్ని అంటున్నారు. ఇదే సమయంలో… పోలవరం కాలువలు తవ్వుతుంటే దేవినేని ఉమా లాంటి వాళ్లతో కోర్టుల్లో కేసులు వేయించాడు ఇదే చంద్రబాబు అని నాని ఫైరయ్యారు.

అనంతరం పవన్ కు కొన్ని కీలక సూచనలు చేసిన కొడాలి.. శృతిమించితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇందులో భాగంగా… జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్‌ నే వెన్నుపోటు పొడిచాడు.. అలాంటి బాబును నమ్ముకుంటే నీకు కూడా అదే గతి పట్టిస్తారు అంటూ పవన్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఇదే విషయాన్ని పవన్‌ ను నేరుగా కలిసి చెప్పాలనుకున్నట్లు తెలిపిన నాని… ఆయన అపాయింట్మెంట్‌ ఇవ్వలేదని అన్నారు. కాబట్టి, చంద్రబాబు ఎలాంటివాడో ఇక తనంతట తానుగా తెలుసుకోవాలి అని పవన్‌ కు కొడాలి నాని సూచించారు.

ఇదే సమయంలో ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న వారాహి 3.0 పై కూడా కొడాలి స్పందించారు. పవన్ కళ్యాణ్ మూడవ విడత వారాహియాత్ర చేయడం వల్ల ఎవరికీ అభ్యంతరం లేదని.. ఎన్నికలయ్యే వరకూ పవన్ ఈ రాష్ట్ర ప్రజల మధ్య తిరిగితే అభ్యంతరం లేదని కొడాలి పేర్కొన్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం తప్పులు ఎత్తిచూపినా.. సీఎం జగన్ పై విమర్శలు చేసినా అభ్యంతరం లేదని తెలిపారు.

కానీ చంద్రబాబు 420 బ్యాచ్‌ తో కలిసి రాజకీయ దాడికి దిగితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. చంద్రబాబును సపోర్ట్ చేసే ఎవరినైనా రాజకీయంగా బట్టలూడదీసి రోడ్డుమీద నిలబెడతాం.. ఒకవేళ చంద్రబాబు స్క్రిప్ట్‌ పవన్‌ అమలు చేయాలనుకుంటే ఎదుర్కొంటాం అని కొడాలి నాని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో గద్దర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు కొడాలి నాని. గద్దర్ మరణం విప్లవ కారులకు, ఉద్యమకారులకు, తమకూ తీరని లోటని కొడాలి నాని అన్నారు. గద్దర్‌ తో తనకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయని.. ఎమ్మెల్యే వంశీతో కలిసి చాలాసార్లు గద్దర్ ను కలిసినట్లు నాని తెలిపారు. 2009లో గద్దర్ చేతుల మీదుగా ఉంగుటూరులో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశామని గుర్తు చేశారు.