క్యాన్సర్ పై స్పందించిన కొడాలి… మామూలు ఉతుకుడు కాదు!

కొడాలి నాని గతకొన్ని రోజులుగా మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే అందుకు ఏదైనా ఆరోగ్య సమస్య కారణం అయ్యి ఉండొచ్చు.. లేదా, బిజీ జీవితంలో కాస్త సమయం ఫ్యామిలీకి కేటాయించి ఉండొచ్చు.. లేదా, రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు. కానీ… కొడాలి కనిపించకపోవడానికి కారణం ఫలానా అని ఒక ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో నానీ ఫైరయ్యారు.

అవును… కొడాలి నానీకి ఆరోగ్యం బాగాలేదని, ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, పైగా… ఆయనకు క్యాన్సర్ వ్యాది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అని.. ఒక టీడీపీ అనుకూల మీడియా నేరుగా ప్రసారం చేసేసింది. సోషల్ మీడియా పేరుచెప్పి… ఇలా కొడాలి నానికి కేన్సర్ అనే విషయాన్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నానికి పూనుకుంది!

దీంతో తాజాగా మైకులముందుకు వచ్చిన మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తన ఆరోగ్యం నిలకడా ఉందని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ సోషల్ మీడియాలో ఒక గాసిప్ తేవడం, దాన్ని స్ప్రెడ్ చేయడం… అదిగో సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం జరుగుతుందని టివీ ఛానల్స్ లో ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడం.. ఇదో నీతిమాలిన చర్య అని కొడాలి నిప్పులు చెరిగారు.

తనకు ఏదో అయిపోయిందని, ఏదో అవ్వబోతుందని, ఫలితంగా తాను గుడివాడలో పోటీ చేసేది కష్టమే అని పనికిమాలిన వార్తలు ప్రసారం చేసుకుని.. తద్వారా శునకానందం పొందుతున్నారని కొడాలి ఫైరయ్యారు. ఇలా టీడీపీ, చంద్రబాబు, వారి అనుకూల మీడియా పాతాళానికి దిగజారిపోతున్నారని అన్నారు!

ఇదే సమయంలో చంద్రబాబు రాజకీయాలకు చరమగీతం పాడించేవరకూ.. రాజకీయాలనుంచి ఇంటికి పంపించేవరకూ… తాను ఈ భూమిని, రాజకీయాలను కూడా వదిలేది లేదని కొడాలి నాని తనదైన శైలిలో స్పష్టం చేశారు.

ఇదే సమయంలో అమరావతిలో మానసిక వైకల్య కేంద్రం ఒకటి నిర్మించమని తాను ఇప్పటికే సీఎం జగన్ కు చెప్పానని గుర్తుచేసిన కొడాలి నాని… ఆ ఆసుపత్రి నిర్మాణం త్వరలో పూర్తి చేయిస్తామని.. అనంతరం 2024 ఎన్నికల తర్వాత ఆ ఆసుపత్రిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను చేర్పిస్తామని కొడాలి స్పష్టం చేశారు!

అదేవిధంగా చంద్రబాబుకు, తన కుమారుడు లోకేష్ లు ఎవరైనా… గుడివాడలో తనమీద పోటీచేయాలని కొడాలి స్వాగతించారు. ఈ విష్యంపై ఇప్పటికే ఎన్నోసార్లు సవాల్ చేశానని గుర్తుచేశారు. అంత ధైర్యం తండ్రీకొడుకులు ఇద్దరికీ లేవని కొడాలి ఎద్దేవా చేశారు. అయితే… ధమ్ము ఉంటేనే అని ఒక క్లాజు పెట్టడం గమనార్హం!