రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు అత్యంత సహజం. ఇదే సమయ్యంలో సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా సహజం. కాకపొతే రాజకీయాల్లో ఎప్పుడూ సవాళ్లు మాత్రమే ఉంటాయి తప్ప వాటిపై నిలబడటం కానీ, వాటికోసం నిలబడి రంగంలోకి దిగడం కానీ జరగడం అరుదు! ఈ క్రమంలో టీడీపీ నేతలు బట్ట కాల్చి మీదేస్తుంటే… ఆ మసి తమకు అంటుకోకుండా వైసీపీ నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా వైసీపీ నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్… వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇందులో భాగంగా అనిల్ రూ.1000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో… తాను అవినీతికి పాల్పడలేదని దేవుడిపై ప్రమాణం చేస్తాను.. నువ్వు కూడా వచ్చి ప్రమాణం చెయ్యి అని సవాల్ విసిరారు.
అయితే ఈ సవాళ్ కు లోకేష్ స్పందించకుండా పలాయనం చిత్తగించగా… అనిల్ మాత్రం అన్నమాట, చేసిన సవాల్ మేరకు వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేశారు. లోకేష్ తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని తెలిపారు. దీంతో… లోకేష్ ఆరోపణల్లో క్రెడిబిలిటీ పోయిందనే కామెంట్లు వినిపించడంతోపాటు.. అనిల్ కుమార్ సచ్చీలతపై కూడా అనుకూలమైన చర్చ జరిగింది.
ఇదే సమయంలో పొన్నూరుకు అత్యంత్య సమీపంలో ఉండే భూములను ప్రస్తుతం ఆలయ ట్రస్ట్ బోర్డు ఆటో నగర్ కు కేటాయిస్తూ తీర్మానం చేసింది. దీనిపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఆలయ భూములను కేటాయిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అనంతరం టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆలయ భూములను పరిశీలించారు. ఈ భూముల కేటాయింపు ద్వారా 50 కోట్ల రూపాయల అవినీతికి ఎమ్మెల్యే పాల్పడుతున్నారని ధూళిపాళ్ల మండిపడ్డారు.
ఈ విషయాలపై స్పందించిన ఎమ్మెల్యే కిలారి రోశయ్య… గత ఎన్నికల సమయంలో ధూళిపాళ్ల నాలుగు హామీలిచ్చారని వాటిని తాను అమలు చేస్తున్నానని, దీంతో తట్టుకోలేక తనపై దృష్ప్రాచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం తనపై చేసిన ఆరోపణలు అసత్యమంటూ తాను సాక్షీ భావన్నారాయణ స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తానని, దమ్ముంటే ధూళిపాళ్ల కూడా ప్రమాణం చేయాలని ఛాలెంజ్ విసిరారు.
అన్నట్లుగానే సాక్షీ భావన్నారయణ స్వామి ఆలయంలో ప్రమాణం చేశారు. తాను ఆటోనగర్ భూముఇల వ్యవహారంలో అవినీతికి పాల్పడలేదని దేవుడి ముందు ఒట్టేసిమరీ చెప్పారు. దీంతో కిలారి రోశయ్య క్రెడిబిలిటీ నిలబడిందనే కామెంట్లు స్థానికంగా వినిపిస్తుండటంతో పాటు… టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరెంద్ర కావాలని బురదజల్లుతున్నారే తప్ప ఆయన ఆరోపణల్లో వాస్తవాలు లేవనే విషయం కూడా తెరపైకి వచ్చిందని అంటున్నారు.
నిజంగా ఆ ఆరోపణల్లో నిజముంటే నరేంద్ర వచ్చి ప్రమాణం చేయాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం నరేంద్ర నాట్ రీచబుల్ అని సమాచారం!
దీంతో… టీడీపీ నేతలు సవాళ్ల పేరు చెప్పి పప్పులో అడుగు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. విమర్శలు చేసే ముందు టీడీపీ నేతలు సవాళ్లకు నిలబడగలిగే ధమ్మున్నప్పుడే రంగంలోకి దిగేలా పరిస్థితులు మారిపోయాయని చెబుతున్నారు.
ఫలితంగా టీడీపీ నేతల విమర్శలపై జనాల్లో విశ్వసనీయత తగ్గడంతోపాటు… వైసీపీ ఎమ్మెల్యేలు అన్న మాట ప్రకారం ప్రమాణాలు చేయడంతో… వారి క్రెడిబిలిటీ పెరుగుతుందని.. ఇది టీడీపీ చేస్తోన్న వ్యూహాత్మక తప్పిదం అని క్లారిటీ ఇస్తున్నారు.