కరుణానిధి పరిస్థితి మరింత సీరియస్

డిఎంకె అధినేత కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనను గోపాలపురంలోని ఇంటి నుంచి కావేరి ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు. ఎనిమిది మంది డాక్టర్ల టీమ్ కరుణానిధికి చికిత్సనందిస్తుంది. కరుణానిధికి బీపీ, పల్స్ రేట్ డౌన్ అయినట్టుగా డాక్టర్లు హెల్త్ బులెటిన్ లో తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం పై పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళన చెంది పెద్ద ఎత్తున్న ఆస్పత్రికి చేరుకుంటున్నారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్ మాత్రం ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్వీట్టర్ లో తెలిపారు. ఇప్పటికే కరుణానిధిని దినకరన్, ఆజాద్, గవర్నర్ పురోహిత్ పరామర్శించారు.

ఎంకేగా  మరియు కళైనార్ గా అందరికి సుపరిచితుడైన ముత్తువేల్ కరుణానిధి జూన్ 3, 1924న ముత్తువేలర్, అంజుగం దంపతులకు తంజావూరు జిల్లాలోని తిరువక్కలైలో జన్మించారు. తమిళ నాయి బ్రాహ్మణ కుటుంబంలో కరుణానిధి జన్మించారు. ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో కరుణానిధి ఒకరు. 1969లో సి.ఎన్ అన్నాదురై మరణించినప్పటి నుంచి పార్టీ అధ్యక్షునిగా కరుణానిధి పనిచేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రానికి ఐదు సార్లు కరుణానిధి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తన 60 సంవత్సరాల రాజకీయంలో పోటీ చేసిన ప్రతిసారి గెలిచిన ఓటమెరుగనివ నాయకుని గా కరుణానిధికి పేరుంది. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించారు. కరుణానిధికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు కూడా రాజకీయ రంగంలోనే రాణిస్తున్నారు.