షాకింగ్: మహిళల అక్రమరవాణాలో ఆంధ్ర నెం:1

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ… ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేసారు. ప్రతివారం ఐదు ప్రశ్నలతో ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నారు కన్నా. ఈ నేపథ్యంలో బుధవారం తన 18 వ లేఖను ఆయన విడుదల చేసారు. మహిళల అక్రమ రవాణా, పోలవరం ప్రాజెక్టు, అమరావతి డిజైన్ రూపకల్పన, అగ్రిగోల్డ్, తిత్లీ… ఈ ఐదు అంశాలపై ప్రశ్నలు సంధిస్తూ లేఖ ఈ వారం ఆయన లేఖ రాసారు. ఆ ప్రశ్నల వివరాలు కింద ఉన్నాయి చదవండి.

మహిళల అక్రమ రవాణాలో ఏపీని నంబర్ 1 స్థానంలో ఉంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేసారు. దేశంలో అక్రమ రవాణాకు బలవుతోన్న మహిళల్లో 26 శాతం మంది మహిళలే అని స్పష్టం చేసారు. ఈ విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదించిందని గుర్తు చేసారు కన్నా లక్ష్మి నారాయణ. పోలవరం ప్రాజెక్టు ముంపు భూముల వ్యవహారంలో టిడిపి నేతలు అక్రమంగా 650 కోట్ల రూపాయలు కాజేయలేదా అని ప్రశ్నించారు.

అమరావతి డిజైన్ల రూపకల్పన సంస్థ మార్పులో 90 కోట్ల రూపాయల ఒప్పందం వెనకున్న రహస్యం ఏమిటని ఆయన నిలదీశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలను కోర్టులు తప్పు పట్టలేదా అని అడిగారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు తీసుకుని తిత్లీకి కేంద్రం ఏమి ఇవ్వలేదని ఆరోపణలు చేయడం సబబేనా అని ప్రశ్నిస్తూ తన లేఖను విడుదల చేసారు.