Former AVSO Satish Kumar: మాజీ ఏవీఎస్ఓ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి: ‘కందారపు మురళి’

Former AVSO Satish Kumar: టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి డిమాండ్ చేశారు.

సతీష్ కుమార్ మృతి పెద్దల పాపపు ఆటలో ఓ ఘట్టంగా ఆయన అభివర్ణించారు. సతీష్ మృతి హత్యా? లేక ఆత్మహత్యా? అన్నది ప్రజలకు వెల్లడి చేయాలని ఆ ప్రకటనలో కోరారు.

పరకామణి అవినీతి వ్యవహారంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము ముందు నుంచి కోరుతున్నామని కందారపు మురళి గుర్తు చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ వల్ల గరిష్టమైన ప్రయోజనం నెరవేరుతుందన్నారు.

కేసు పూర్వాపరాలు అనేక అనుమానాలకు తావిస్తున్నదని ఈ కారణంగానే తాము సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరామని గుర్తు చేశారు. పరకామణి వ్యవస్థలో జరుగుతున్న లోపాలను సరిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని, విచారణలో పారదర్శకత పాటించాలని, నిందితులు ఎంతటి వారైనా శిక్షించేటట్టుగా వ్యవహరించాలని కందారపు మురళి సూచించారు.

Public EXPOSED: Chandrababu Super Six Schemes || Ap Public Talk || Ys Jagan || Pawan Kalyan || TR