రావాల్సిన టైమ్ లో జూనియర్ ఎన్టీఆర్ వస్తాడులే.. లెక్కలు కూడా తేల్చేస్తాడు!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని చాలా సంవత్సరాల నుంచి పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తూనే ఉంది. అయితే తారక్ కు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉందా? రాజకీయాల్లోకి వచ్చినా టీడీపీలో ప్రాధాన్యత ఉంటుందా? ఇన్నిరోజుల పాటు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన విమర్శల సంగతేంటి? క్రేజ్ పెరిగితే మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ కు ప్రాధాన్యత ఉంటుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

మళ్లీ వాడుకుని వదిలేయాలనే ఆలోచనతోనే జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి పిలుస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం సినిమా రంగంలో అంచనాలకు మించి క్రేజ్ ఉండగా సొంతంగా తారక్ పార్టీ పెట్టినా రాజకీయాల్లో సక్సెస్ అవుతారనే నమ్మకం పొలిటికల్ వర్గాల్లో ఉంది. అయితే నందమూరి కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాలని తారక్ భావించడం లేదు.

అదే సమయంలో నందమూరి కుటుంబం తీసుకున్న ప్రతి నిర్ణయానికి జూనియర్ ఎన్టీఆర్ తలూపే పరిస్థితులు కూడా లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ను తక్కువగా అంచనా వేస్తే మాత్రం ఇతర రాజకీయ నేతలకు ఏదో ఒకరోజు షాక్ తప్పదు. ప్రస్తుతం ఎన్టీఆర్ సైలెంట్ గానే ఉన్నారని అయితే సమయం వస్తే మాత్రం తారక్ లోని మరో కోణం బయటికొస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ త్వరలో భారీ ప్రణాళికలతో రాజకీయాల్లోకి వస్తే మాత్రం పరిస్థితులు మరో విధంగా ఉంటాయని కొంతమంది చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా తేల్చాల్సిన లెక్కలు తేల్చేస్తాడని ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహాలు అవసరమే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.