యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తారక్ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారా? లేదా? అనే ప్రశ్నకు సైతం సరైన సమాధానం దొరకడం లేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాలే జీవితంగా తారక్ ప్రయాణం కొనసాగుతోంది. ఇతర భాషల ప్రేక్షకులకు సైతం మరింత చేరువయ్యే దిశగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అడుగులు పడుతున్నాయనే సంగతి తెలిసిందే.
నందమూరి, నారా కుటుంబాలతో జూనియర్ ఎన్టీఆర్ కు గ్యాప్ ఉండటం వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తమ మాటలకు విలువ ఉండదని నందమూరి, నారా కుటుంబ సభ్యులు సైతం భావిస్తుండటం గమనార్హం. ఈ రీజన్ వల్లే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేయడానికి కూడా చంద్రబాబు కానీ లోకేశ్ కానీ అస్సలు ఇష్టపడటం లేదు.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సైతం తనకు ఆర్.ఆర్.ఆర్ సినిమాతో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో చేయి కలపడం ద్వారా కెరీర్ పరంగా మరో మెట్టు పైకి ఎదగడం గ్యారంటీ అని తారక్ నమ్ముతున్నారు. వాస్తవానికి తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఎన్నో కామెంట్లు వినిపిస్తున్నా వాటి గురించి రియాక్ట్ కావడానికి కూడా తారక్ ఇష్టపడటం లేదు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయంలో పొరపాట్లు జరగకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సరైన సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే లోకేశ్ కు భయం అని ఆ భయం వల్లే తారక్ కు పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తారక్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడో చూడాల్సి ఉంది.