యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచారు. పవన్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గొడవ పడటం గతంలో హాట్ టాపిక్ అయింది. అయితే అరవింద సమేత సినిమా లాంఛ్ ఈవెంట్ లో పవన్, తారక్ కలిసి తమ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఒక సందర్భంలో పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నానని తారక్ కామెంట్లు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
జనసేన పార్టీ గురించి ప్రశ్నలు ఎదురు కాగా తారక్ ఈ విధంగా సమాధానం ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. అయితే వైరల్ అవుతున్న కామెంట్ల గురించి తారక్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. తారక్ పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేస్తే తారక్ అభిమానులు సైతం పవన్ పార్టీకి ఓటు వేసే ఛాన్స్ అయితే ఉంది. తారక్ కు కూడా ఏపీ రాజకీయాల్లో సత్తా చాటాలని ఆసక్తి ఉందనే సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని తారక్ ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ కావాలని ప్రయత్నిస్తే తన పొలిటికల్ కెరీర్ కు భారీ స్థాయిలో నష్టం కలిగే అవకాశం అయితే ఉందని ఆయన భావిస్తున్నారని సమాచారం అందుతోంది. తారక్ 2029 ఎన్నికలు లేదా 2034 ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
తారక్, పవన్ ప్రస్తుతం సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. ఫ్యాన్స్ మధ్య విభేదాలు ఉన్నా పవన్, తారక్ మాత్రం తమ మధ్య ఎలాంటి విబేదాలు లేవని చాలా సందర్భాల్లో వెల్లడించారు. పవన్, తారక్ కలిస్తే ఏపీలో జనసేన అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో పవన్, తారక్ ఈ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.