జనసేన పార్టీలోకి జంపింగులట.! జోక్‌గానీ కాదు కదా.?

జనసేన పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నేతలు జంపింగ్ చేయడానికి సిద్ధంగా వున్నారట. చాలాకాలంగా ఈ మాట జనసేన నేతలు చెబుతోంటే, ‘కామెడీ చేస్తున్నారు కదా..’ అంటూ జనసేన మీద సెటైర్లు వేస్తూ వచ్చారు ఆయా పార్టీలకు చెందిన నేతలు.

అసలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీకి వున్న సీన్ ఎంత.? ఈ విషయమై భిన్న వాదనలున్నాయి. బీజేపీ కంటే జనసేన, ఓట్ల శాతం కంటే చాలా చాలా బెటర్. బీజేపీలోకి నేతలు దూకుతున్నప్పుడు, జనసేనలోకి ఎందుకు దూకరు.? కానీ, ఇక్కడ బీజేపీ దేశంలో అధికారంలో వున్న పార్టీ. కానీ, జనసేన అలా కాదు.!

అసలంటూ జనసేన పార్టీ రాజకీయాల్లో టైమ్ పాస్ కోసం అన్నట్లు వుంది తప్ప, జనసేనాని సీరియస్ రాజకీయాలు చేయడంలేదన్న విమర్శ కూడా లేకపోలేదు. అయినాగానీ, రాజకీయ నాయకులకు కొన్ని లెక్కలుంటాయ్. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఉపయోగం.? అన్న కోణంలో అన్నీ లెక్కలేసుకుని వుంటారు.

ఔను, జనసేన పార్టీలోకి వలసలు జోరందుకోనున్నాయ్. బీజేపీ నుంచి కన్నా లక్ష్మినారాయణ, కామినేని శ్రీనివాస్ తదితరులు జనసేనలోకి దూకెయ్యడానికి సిద్ధంగా వున్నారట. ఉత్తరాంధ్ర వైసీపీ నుంచి ఓ అరడజను మంది నేతలు జనసేనలోకి టచ్‌లోకి వెళ్ళారనే ప్రచారమూ జరుగుతోంది.

టీడీపీ నుంచి కూడా నలుగురైదుగురు నేతలు జనసేనతో టచ్‌లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. రాజకీయాలన్నాక ఇలాంటివి సహజం. జంపింగులు నిజమే అయితే, ఆ జంపింగ్ జపాంగుల వల్ల జనసేన పార్టీనే అంటిపెట్టుకున్న యువ నాయకుల పరిస్థితి ఏంటి.? జనసైనికుల భవిష్యత్తేంటి.?