వైసీపీకి జూనియర్ ఎన్టీయార్ సపోర్ట్ చేస్తాడా.?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి వేడుకలకు సంబంధించి ఆయన మనవడు జూనియర్ ఎన్టీయార్‌కి తీవ్ర అవమానం జరుగుతోంది. టీడీపీ నేతృత్వంలో జరుగుతున్న ఈ వేడుకలకు అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ.

మొదటి నుంచీ జూనియర్ ఎన్టీయార్ విషయంలో ఒకింత ‘తేడా’గా వ్యవహరిస్తున్న బాలకృష్ణ, ఇప్పుడూ అదే కోణంలో జూనియర్ ఎన్టీయార్‌ని దూరం పెడుతున్నారన్నది జూనియర్ ఎన్టీయార్ అభిమానుల ఆరోపణ.

నందమూరి అభిమానులు మాత్రం, జూనియర్ ఎన్టీయార్‌ని టీడీపీకి దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సరైన ఆహ్వానం జూనియర్ ఎన్టీయార్‌కి నందమూరి కుటుంబం నుంచీ, టీడీపీ నుంచీ అందడంలేదు.. కీలకమైన వ్యవహారాలకు సంబంధించి. కానీ, జూనియర్ ఎన్టీయార్ వైపు నుంచే తప్పులు దొర్లుతున్నాయన్నది ఓ సెక్షన్ ‘నందమూరి’ అభిమానుల ఆరోపణగా కనిపిస్తోంది.

ఎవరి గోల ఎలా వున్నా, జూనియర్ ఎన్టీయార్ అయితే టీడీపీ నుంచి దూరంగా జరగాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీయార్ మీద ప్రత్యేకమైన అభిమానం చూపిస్తోంది వైసీపీ.

మొన్నామధ్య ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయమై వైసీపీ శ్రేణుల నుంచి జూనియర్ ఎన్టీయార్ ట్రోలింగ్ ఎదుర్కొన్నాగానీ, ఆ తర్వాత జూనియర్ ఎన్టీయార్‌కి వైసీపీ సోషల్ మీడియా విభాగం మద్దతివ్వడం మొదలెట్టింది. ఏమో, ఏదైనా జరగొచ్చు. టీడీపీ మీద మంటతో జూనియర్ ఎన్టీయార్, వైసీపీకి రాజకీయంగా మద్దతిచ్చినా ఆశ్చర్యమేముంది.?