జూనియర్ ఎన్టీయార్ కూడా టీడీపీ వైపేనా.?

జూనియర్ ఎన్టీయార్ రాజకీయంగా మౌనంగా వున్నాడు.! 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేయడం మినహా, ఆ తర్వాత పెద్దగా రాజకీయాల్లో ఆయన తలదూర్చింది లేదు. కానీ, జూనియర్ ఎన్టీయార్ పేరుతో తరచూ టీడీపీ అల్లరి చేస్తుండడం చూస్తున్నాం.

టీడీపీలో ఓ వర్గానికి నిత్యం అదే పని. జూనియర్ ఎన్టీయార్‌ని టార్గెట్ చేయడం ద్వారా, టీడీపీని దాదాపుగా ఆ వర్గం నాశనం చేసేసిందన్నది నిర్వివాదాంశం. అయితే, డ్యామేజ్ కంట్రోల్ చర్యలు ప్రారంభమయ్యాయనీ, జూనియర్ ఎన్టీయార్ తిరిగి టీడీపీకి మద్దతిస్తాడనీ అంటున్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆల్రెడీ, జూనియర్ ఎన్టీయార్‌తో సంప్రదింపులు జరిపాడట. చంద్రబాబు అరెస్టు తర్వాత, నారా లోకేష్‌తో స్వయంగా జూనియర్ ఎన్టీయార్ మాట్లాడి, ఓదార్చాడని తెలుస్తోంది. మరోపక్క, మేనత్త భువనేశ్వరితోనూ జూనియర్ ఎన్టీయార్ మాట్లాడి ధైర్యం చెప్పాడట.

ప్రత్యక్షంగా కలిసి ఎందుకు ఈ పనులు జూనియర్ ఎన్టీయార్ చేయలేదు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఇంకో పక్క, జూనియర్ ఎన్టీయార్ మీద టీడీపీ క్యాడర్ తీవ్ర అసహనంతో వుంది. ఆ అసహనంతో విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు.

అయితే, త్వరలో జూనియర్ ఎన్టీయార్ స్వయంగా నారా లోకేష్‌నీ, నారా భువనేశ్వరినీ కలవబోతున్నాడనీ, బాలయ్య సమక్షంలోనే ఈ భేటీ వుంటుందనీ సమాచారం. మరోపక్క, 2024 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీయార్ నుంచి తమ కూటమికి మద్దతు వుంటుందని జనసేనాని భావిస్తున్నారు.

ఈ విషయమై ఇప్పటికే తారక్ నుంచి సానుకూల స్పందన వచ్చిందట జనసేనానికి.! ఇది నిజమేనా.? టీడీపీ, జనసేన కలిసి ప్లే చేస్తున్న మైండ్ గేమ్ అనుకోవచ్చా.?