ఎన్టీఆర్ ఆత్మ మరోసారి క్షోభిస్తోన్న వేళ… జూనియర్ దూరం!

ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి… ఎన్టీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గొప్ప నటుడని కొనియాడారు.

ఇందులో భాగంగా.. కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఎన్టీఆర్‌ నటన అద్భుతమని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఎన్టీఆర్ విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పారు. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు.

అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ రామారావు సతీమణి లక్ష్మీ పార్వతికి ఆహ్వానం అందలేదు! దీంతో.. ఇది బీజేపీ మార్కు హిందూ ధర్మం అని అంటున్నారు పరిశీలకులు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అసలు సిసలు వారసుడిగా నందమూరి అభిమానులతో పాటు సామాన్య ప్రజానికం భావించే… జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు!

ఆ సంగతి అలా ఉంటే… కావాలనే రాలేదా, లేక.. తాత ఇచ్చిన ఒరిజినల్ పౌరుషం వల్ల రాలేదా అనే చర్చ ఆన్ లైన్ వేదికగా మొదలైపోయింది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులతో వేదిక పంచుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా లేరని అంటున్నారు. అందుకే శతజయంతి ఉత్సవాలకు సైతం హాజరు కాలేదని చెబుతున్నారు.

ఇలా భార్యగా లక్ష్మీ పార్వతి.. అసలు సిసలు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవడంతో పాటు… చంద్రబాబు, రఘురామకృష్ణంరాజు, కొంతమంది టీడీపీ నేతలు, ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడవడంలో సహకరించిన వారు హాజరయ్యారు. దీంతో.. ఇది బీజేపీ ఆడిన ఎన్నికల స్టంట్ అనే కామెంట్లు మొదలైపోయాయి.

ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే విషయంలో ఇప్పటివరకూ ఏనాడూ ప్రయత్నించని ఆయన కుమారులు, కుమార్తెలు… ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో వందరూపాయల నాణెంతో రాజకీయాలకు పాల్పడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… ఆయన ఆత్మను ఇంకా ఎంతకాలం క్షోభ పెడతారనే చర్చ మొదలైపోయింది.

ఇదే సమయంలో అసలోల్లు తప్ప కొసరోళ్లు.. ఆయనకు కన్నీళ్లు మిగిల్చినోళ్లు మాత్రమే హారజయ్యారంటూ… ఈ వేడుకపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ… ఈ కార్యక్రమానికి గౌర్జారవ్వడంలో జూనియర్ ఎన్టీఆర్… నిఖార్సైన పౌరుషాన్ని చూపించారని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం!