జేడి  ముసుగు తొలగిపోతోంది..టిడిపి నుండి భీమిలీలో..

అవును సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ ముసుగు తొలగిపోతోంది. తొందరలో జేడి టిడిపిలో చేరుతున్నారట. జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసులు నమోదు చేయటంలో, దర్యాప్తు చేయటంలో లక్ష్మీనారాయణ అప్పటి సంయుక్త రాష్ట్రంలో బాగా పాపులరయ్యారు. చంద్రబాబునాయుడుకు అనుకూలంగా జగన్ పై అక్రమ కేసులు పెట్టారని ఎంతగా అపఖ్యాతి మూటగట్టుకున్నారో అంతేస్ధాయిలో చంద్రబాబు మీడియా, జగన్ వ్యతిరేకులు జేడిని అంతగా ఆకాశానికి ఎత్తేశారు.

మొత్తం మీద విధినిర్వహణలో హోదానే ఇంటిపేరుగా మారిపోయిన వ్యక్తి లక్ష్మీనారాయణ. అంతగా పాపులరైన వ్యక్తి ముందు కొత్తపార్టీ పెడతానని చెప్పి తర్వాత నీరుగారిపోయారు. తాజాగా టిడిపిలో చేరి విశాఖపట్నం జిల్లాలోని భీమిలీ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నట్లు టిడిపి మీడియానే చెబుతోంది. మొన్నటి వరకూ బీమిలీలో నారా లోకేష్ పోటీ చేయబోతున్నట్లు ఫీలర్లు వదిలారు. ఇపుడేమో జేడి పోటీ చేస్తాడంటున్నారు.

మొదటినుండి జేడికి చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న విషయం అందరికీ తెలిసిందే.  పైగా చంద్రబాబు కోసమే జగన్ పై అక్రమ కేసులు పెట్టి విచారణ జరుపుతున్నారనే అపఖ్యాతిని కూడా మూటగట్టుకున్నారు. దర్యాప్తు వివరాలు ప్యారలల్ గా చంద్రబాబు మీడియాలో రావటం కూడా అప్పట్లో సంచలనంగా మారింది.  చంద్రబాబుతో అంత సన్నిహిత సంబంధాలున్న జేడి టిడిపిలో చేరుతున్నారని చెప్పటంలో ఎవరికీ ఆశ్చర్యం కలగటం లేదు. కాకపోతే కాస్త ఆలస్యమైందంతే అనుకుంటున్నారు.