పవన్ రాజకీయాలకు పనికిరాడా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడా ? అలాగనే చెబుతున్నారు టిడిపి నేత జేసి దివాకర్ రెడ్డి.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని అనంతపురం టిడిపి మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో సినిమా వాళ్ళ అనే టాపిక్ పై జేసి మాట్లాడుతూ పవన్ రాజకీయాలకు పనికిరాడన్న విషయం మొన్నటి ఎన్నికలతో రుజువైపోయిందన్నారు.

మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయంపై మాట్లాడుతూ పార్టీకి చంద్రబాబునాయుడు ఒక్కడే దిక్కన్నట్లు మాట్లాడారు. చంద్రబాబు తప్ప మరో నేత పార్టీని సమర్ధవంతంగా నడపలేడని కూడా అభిప్రాయపడ్డారు.  జూనియర్ ఎన్టీయార్ వచ్చి పార్టీ పగ్గాలు అందుకోవాలని వినిపిస్తున్న డిమాండ్లను కొట్టిపారేశారు జేసి.

సినిమాల్లో బిజీగా ఉన్న జూనియర్ కు పార్టీ పగ్గాలు అందుకనేంత సీన్ లేదన్నారు.  గతంలో జూనియర్ పార్టీకి ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం కన్పించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అదే సందర్భంలో పవన్ గురించి మాట్లాడుతూ జనసేన ఓ విఫల ప్రయోగమన్నారు.

పవన్ రాజకీయాలకు ఏమాత్రం పనికిరాడన్న విషయాన్ని జనాలు తేల్చి చెప్పేసినట్లు జేసి అభిప్రాయపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన సీట్లు, గెలిచిన సీట్లు ఏమిటో అందరూ చూసిందే అన్నారు. అసలు డిపాజిట్లు ఎన్ని సీట్లలో వచ్చిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.