పట్టించుకోరా..? చంద్రబాబుకు ఫోన్ చేసి జేసీ ఆవేదన ?

JC Prabhakr Reddy unhappy with TDP leaders
కొన్ని రోజుల క్రితం టీడీపీ నేత, సీనియర్ నాయకుడు జేసీప్రభాకర్ రెడ్డి ఇంటి మీద తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎన్నో ఏళ్ల నుండి జేసీ, కేతిరెడ్డి ప్రత్యర్థులుగా ఉన్నారు.  వీరి శత్రుత్వం ఫ్యాక్షన్ నుండి రాజకీయాల వైపుకు మళ్లింది.  ఇన్నాళ్లు రాజకీయాల్లో జేసీ కుటుంబానిదే పైచేయిగా ఉంటూ వచ్చింది.  కానీ గత ఎన్నికలో వైసీపీ తరపున గెలవడంతో కేతిరెడ్డికి కొండంత బలం వచ్చినట్టైంది.  అదే సమయంలో అనంతపురం లోక్ సభ స్థానం నుండి దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ కుమార్, తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుండి ప్రభాకర్ రెడ్డి  కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీచేసి ఓడిపోయారు.  దీంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాల్లో వారి ప్రాభవం తగ్గిపోయింది.  ఇది కేతిరెడ్డికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. 
 
JC Prabhakr Reddy unhappy with TDP leaders
JC Prabhakr Reddy unhappy with TDP leaders
ఆ ధైర్యంతోనే ఆయన ప్రభాకర్ రెడ్డి ఇంటికి మందీ మార్బలంతో వెళ్లి హంగామా చేశారు.   ఈ ఘటనలో తప్పిదం ఎవరిదనేది స్పష్టం.  తాడిపత్రి లాంటి సెన్సిటివ్ ప్రాంతంలో ఒక పాపులర్ నాయకుడికి ఇలాంటి ఇబ్బంది ఎదురైతే అతని వెనకున్న పొలిటికల్ పార్టీ గట్టిగా రియాక్ట్ అవ్వాలి.  కానీ టీడీపీ కాలేదు.  నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, కాల్వ శ్రీనివాసులు, ఇంకో ఒకరిద్దరు నేతలు మినహా ఎవ్వరూ పెద్దగా స్పందించలేదు.  ఈ విషయంలో పాలకవర్గం మీద ప్రతిపక్షం పెద్దగా ఒత్తిడి తేలేకపోయిది.  ఇది జేసీని ఆవేదనకు గురిచేస్తోందట.  ఇంత జరిగినా తనకు మద్దతుగా పార్టీ నిలవకపోవడం ఆయన్ను కలచివేస్తోందట.  పైపెచ్చు ఈ ఘటనలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కువ జేసీ వర్గం మీదే పడ్డాయి.  దీంతో ప్రభాకర్ రెడ్డి నేరుగా చంద్రబాబుకే ఫోన్ చేశారట. 
 
ఇంత ఇబ్బందిపడుతుంటే అండగా నిలబడరా, సొంత జిల్లా నేతల నుండి కూడ మద్దతు లేదని అంటూ గోడు వెళ్లబోసుకున్నారట.  దేంతో చంద్రబాబు నేతలకు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నారట.  జేసీకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదని గట్టిగానే అడిగారట.  ఆ ప్రభావంతోనే పరిటాల సునీత, శ్రీరామ్ రియాక్ట్ అయ్యారని, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు  వెళ్లి జేసీని పరామర్శించారని, బాబుగారు చెప్పకుండా ఉంటే వాళ్ళు కూడ వచ్చేవారు కాదని చెప్పుకుంటున్నారు.  గతంలో కూడ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు నకిలీ పత్రాలతో బస్సులు, వాహనాలు తిప్పుతున్నారనే కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడ తెలుగుదేశం నుండి పెద్దగా మద్దతు అందలేదు.  అప్పుడు కూడ ప్రభాకర్ రెడ్డి హైకమాండ్ మీద తీవ్ర అసంతృప్తి చెందారు.